ఉండేది పిడికెడంత -
వినిపిస్తావు ప్రపంచమంత -
కనిపిస్తావు కళ్ళనిండా -
నిన్ను ఏల వదులుకోవాలంట
జనాల మధ్య కట్టింది వారధి -
మనసులోని భావాలను దగ్గరకు చేసే సారధి
గత జ్ఞాపకాలను చూపు స న్నిధి -
సంతోషాలను ద్విగుణీకృతంచేసే పెన్నిధి
జేబులో నువ్వుంటే డాబు --
పైసా లేకపోయినా నవాబు -
చేతిలో నీ మాయాజాలం -
ఉన్నంతకాలం చుట్టూతిరుగుతుంది ప్రపంచం
నాటైం అంతా నీకే అర్పణం-
అంతర్జాలానికి అందిస్తావు సహకారం -
చిటికెలోచేరుస్తావు ఆవలితీరం -
గూగుల్ లో గమ్మత్త్తులు చేసి -
వాట్సాప్ తో నలుగుర్నిపలకరించి -
మెయిల్ లో విషెస్ తెలిపి -
ఫేసుబుక్కులో పరిచయాలు పెంచి -
ఆన్లైన్ షాపింగులకు ఆధారమై -
పడేశావు ఉత్తరాలను ఒకమూలకు -
తుడిచేసావు టెలిగ్రాఫు చిరునామాను -
కరోనాకాలాన నీసాయం అనిర్వచనీయం -
ఆన్ లైన్ క్లాసులుచెప్పి చేసావు విద్యాబోధనం -
నీకుసలామంటుంది ఆమెజాను -
నీవుజేబులోని కీరవాణివి -
డబ్బుల్ని కాజేసే మహారాణి వి --
రే టింగులు చాటింగులు కలిపించావు -
పట్టిస్తున్నావు యూవతను పెడద్రోవ -
అయినావదిలిపెట్టడంలేదు నీజాడ -
నీవిజ్ఞానాన్ని వూడిగంచేయించుకుంటున్నాడు మనిషి -
బిచ్చగాడి దగ్గరనుంది బ్రిటిష్ ప్రధానీదాకా నీబానిసలే
బందీలైనాము నీ చేతిలో -
ఓ చరవాణీ ---
నీవు లేక మాబ్రతుకు ఖాళీ ...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి