కందం:
*మిత్రుని విపత్తునందుఁ గ*
*ళత్రమను దరిద్రదశను భ్రాతలగుణమున్*
*బాత్రాది విభక్తంబున*
*గోత్రను గనుఁగొనఁవలయు గువ్వలచెన్నా!*
తా.:
ఈ భూమి మీద మనకు కష్టాలు కలిగినప్పుడు మన స్నేహితులు అనే వారు ఎవరైనా మనతో వున్నారా అని చూడాలి. అలాగే, కుటుంబం లో డబ్బులు పోయి బీదరికము వచ్చినప్పుడు భార్య ఆ కుటుంబాన్ని ఎంత చక్కగా, తెలివిగా నడిపిస్తుంది అనేదే ఆమే గురించి చెపుతుంది. ఇక అన్నదమ్ములు. ఇల్లు వాకిలి, డబ్బు దస్కం, గొడ్డు గోదా పంపకాలు చేయవలసిన టైము వచ్చినప్పుడు ఈ అన్నదమ్ములు, తోబుట్టువులు ఎలా వ్యవహరిస్తారు అనేది అప్పుడు తెలుస్తుంది ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*సుగ్రీవుని కి కష్టం వస్తే రాముని స్నేహం కాపాడింది. రాముడు అడవులకు వెళ్ళవలసి వస్తే లక్షణ స్నేహం తోడువుంది. రాముడి సీతను రావణబ్రహ్మ ఎత్తుకు వెళుతుంటే జయటాయువు, శబరి స్నేహం తోడు వుంది. శ్రీకృష్ణ కుచేల స్నేహం నిరుపమానం. ఇవీ స్నేహానికి నిదర్శనాలు. వనవాస సమయంలో పాండవ పత్ని ద్రౌపది వ్యవహరిచిన తీరు, కష్టకాలంలో నల దమయంతుల వ్యవహార శైలి, వీరు కుటుంబ కష్టకాలంలో ఎలా వుండాలో చెప్పకనే చెప్పారు. దశరధ కుమారులు, పాండురాజు కుమారులు అన్నదమ్ములు కలసి మెలసి ఎలా వుండాలో అనుసర యోగ్యంగా చేసి చూపారు. అందుకే, మహాభారతం, శ్రీమద్రామయణం, భాగవత గ్రంధాలను మనం చదివి, మన పిల్లతో కూడా చదివించాలని ఎన్నో మార్లు మనకు చెప్పారు.*
..... ఓం నమో వేంకటేశాయ
*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౧౬ - 016)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి