కందం:
*వనజజకులులును శూద్రులు* *యనియెడి భేదంబులేక యందరు నొకరీ*
*తిని గొని యాచారాదుల*
*గుణముల సరి నుంద్రుముందు గువ్వలచెన్నా!*
తా.:
మనుషులు వుండే ఈ మానవ లోకంలో రాబోయే కాలంలో బ్రహ్మ గారి కులంలో పుట్టాము అనుకుంటున్న బ్రాహ్మణలు గానీ, లేదా తక్కువ కులములో పుట్టిన వారెవరైనా గానీ, ఒకరి మీద ఒకరు బేధాలు చూపకుండా ధర్మాన్ని ఆచరిస్తూ, గుణవంతులు అయి కలసి మెలసి జీవితం గడుపుతారు ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*మానవాళి ఐకమత్యం తో వుండి, పరమత సహనాన్ని పాటిస్తూ అందరూ సమానమే అని ఒప్పుకుని వున్న నలుగురూ కలసి మెలసి వుండాలని మనమందరం కోరుకుందాము. పుట్టిన కులాన్ని బట్టీ ఏవ్యక్తికి గౌరవం దక్కదు. ఆ వ్యక్తి గుణగణాలు ఎంత బావున్నాయి, ఆ వ్యక్తి తన దగ్గర, తన చుట్టూ వున్న ఎంత మంది కి వుపయోగపడే పనులు చేశారు అనే విషయాల మీదే ఆ వ్యక్తి కి గౌరవం అనేది దొరుకుతుంది అని పెద్దలు చెప్పిన మాట. అందువల్ల, సమాజంలో గౌరవం పొందాలి అంటే మనంపుట్టిన కులం కాదు, మన గుణమే ముఖ్యము. ఈ విషయాన్ని అందరమూ ఒప్పుకుని అలా వుండే ప్రయత్నం నిస్సంసయంగా చేయాలి.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి