కొరియర్ బాయ్;-నెల్లుట్ల సునీతఖమ్మం- సెల్ ;7989470657
మనుగడే ప్రశ్నార్ధకమై
 మరో మార్గం లేక  
బరువుల  బ్యాగ్ ను మోస్తూ
 అతని నిరంతర
 జివీత యాత్రలో

అవిశ్రాంత శ్రమలో
  అణుశక్తి ఇంధనం
  దేహంలో నింపుకుని
కాంతివేగంతో కాలంతో
 పరుగులు పెడుతూ
బతికేయడం నేర్చినోడు

దూరమైన భారమైన 
చిరునామాలను జల్లెడ పడుతూ
అరచేతిలో నిలిచిన 
సెల్ఫోన్తో ఆత్మీయ 
పరిచయంతో

వేడుకలు విలాసాలకు
 అందరికీ ఆనందం పంచేటోడు

వస్తువుల అందజేత
  వెతల వెతుకులాటలో అతని 
బతుకు వేట సాగిస్తూ
ఉద్యోగ ధర్మంలో సమస్యల 
వంతెనలు దాటుతూ
జీవితానుభవాలెన్నో గడించినోడు

ఆధునిక జీవనశైలిలో
 నమ్మకానికి నిదర్శనంగా
 నిలిచి
నెట్టింట్లో నుండి
 నట్టింట్లోకి ప్రయాణిస్తూ
కాసు రూపేనా కానుకలు
 ఇస్తూ
 మండుటెండల్ని లెక్కచేయక
జడివానలో తడిసి 
ముద్దవుతూ
 వణికే చలిలో సైతం
 మంచునే యూనిఫామ్ గా 
ధరించి
ద్విచక్రవాహనంపై 
గల్లీ గల్లీలో తిరిగే 
పొద్దు తిరుగుడు పువ్వు అతను

చదివిన చదువులకు
 ఉపాధి కరువై
కుటుంబ పోషణ సవాళ్లను
 అధిగమించే జీవన
 నైపుణ్యాలు పుణికిపుచ్చుకొని
నిరుద్యోగ ముసుగులో 
ఉన్న ఉద్యోగి అతను

ఇంటి ముందు కాలింగ్ 
బెల్ నొక్కి 
కొరియర్ కొరియర్ 
అని తీయని పలకరింపుతో
 అందరికీ ఆత్మబంధువై
హైటెక్ వ్యాపార 
సేవలు అందించే
 కొరియర్ బాయ్
అతనే డెలివరీ బాయ్

కామెంట్‌లు
Unknown చెప్పారు…
చాలా చాలా బాగారాసారు మేడం, అభినందనల చందనాలు👌🏻👌🏻👏🏻👏🏻💐💐💐💐🤝🤝🙏
G.Bhanu vardhan చెప్పారు…
కొరియర్ బోయ్ సేవలను చక్కగా వివరించారు.
గేరపాటి భాను వర్ధన్ చెప్పారు…
కొరియర్ బోయ్ సేవలను చక్కగా వివరించారు.