సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414. peddissrgnt@gmail.com

 
శరీరం-1
 @ శరీరం రథం, బుద్ధి సారథి, మనసు కళ్ళెము అని గ్రహించు. కఠోపనిషత్
@ ఆరోగ్య శరీరం ఆత్మకు అతిధి గృహం, అనారోగ్యమైనది జైలు. ఫ్రాన్సిస్ బేకన్
@ శరీరం పరులకు ఉపకారం చేయడానికి వున్నది కాని స్వార్ధం కొరకు కాదు. 
@ శరీరం మల,మూత్ర,మాంస, నెత్తురు, చీముతో దుర్గంధభూయిష్టం. అశాశ్వతం, గుర్తించు. 
@ శరీరం సామాన్యమైనది కాదు. ఆత్మ దేవునకు మందిరం. భగవంతుడు ఊరేగటానికి వినియోగించే దివ్యరథం. రథంలోపల రథికునిలా @ @ శరీరమనే రథంలో జగన్నాధుడు వెలుగుతున్నాడు. బయట దూరంగా వెతికి వేసారటం వృధా. విద్యా ప్రకాశానందగిరి స్వామి
@ ఏ విషయాన్నయినా.   ముఖ్యంగా చదివింది గుర్తుంచుకోవాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.   అప్పుడే మెదడు పూర్తిస్థాయిలో పనిచేస్తుంది.   దాంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.  అబ్రహాం లింకన్
@ చాలా ప్రాథమిక రోగాలు శరీరం తనకు తాను చేసుకొనే వైద్యమే. మామూలు జ్వరమూ, జలుబూ, కురుపులూ వంటివి శరీరం తనకు తాను చేసుకునే వైద్యమే . కొడవటిగంటి కుటుంబరావు
@ జాతస్య మరణం ధ్రువం. – పుట్టిన శరీరం గిట్టక తప్పదు.
@ శరీరం అనే రథము మీద జీవాత్మ అను రథికుడు ఎక్కి, ఇంద్రియాలనెడి గుర్రాలను రథాలకు కట్టి, మనసు అనే పగ్గాలతో లాగుతూ, బుద్ధి అనే సారథితో రథాన్ని తోలుచున్నాడు. కఠోపనిషత్
@ జీవితంలోని అన్ని ఆస్తులకంటే ఖ్యాతి గొప్పది. శరీరం నశించినా నిలిచేది అదే.షిల్లర్
@ దేశానికి ఉపయోగపడని శరీరం, డబ్బు ఎంత పెరిగినా వృధానే. వివేకానంద 
@ పరోపకారం ఇదం శరీరం.
@ పుట్టిన శరీరం గిట్టక తప్పదు. 

కామెంట్‌లు