కదిలే కాలం; -వెంకట రమణ రావు9866186864
 ట్రైన్ వేగంగా కదులుతోంది. కిటికీ దగ్గర కూర్చుని కదిలిపోతున్న దృశ్యాలను చూస్తున్నాడు మా బాబు చిన్నా 
"నాన్నా ఆ చెట్లు ఎందుకు అలా వెనక్కి వెళ్తున్నాయి ,మనం ముందుకి వెళ్తున్నాము కదా"
"లేదు చిన్నా ఆ చెట్లు ఎక్కడికి వెళ్ళడం లేదు మనమే ముందుకు వెళ్తున్నాము."
మరి మనం ఆ చెట్లని చూడాలంటే ఎలా నాన్నా"
"మనం మళ్లీ వెనక్కి వెళ్తే ఆ చెట్లని చూడచ్చు చిన్నా"
" అయితే 
"వెనక్కి వెళ్దాం నాన్నా ఆ చెట్లు పొలాలు చాలా బాగున్నాయి"
"ముందు ముందు ఇంకా చాలా కొత్తవి వస్తాయి చిన్నా  వాటిని కూడా చూడాలి కదా నువ్వు"
"అంటే మనం ఎప్పుడూ ముందుకి వెళ్తూ ఉండాలి కదా ఎప్పుడు ఎన్నో కొత్తవి చూడచ్చు."
"అవును చిన్నా వెనక్కి వెళ్ళాలని ఎప్పుడూ అనుకోకూడదు, అలా అనుకుంటే ముందు ఉన్న ఎన్నో కొత్త వాటిని చేరుకొలేము"
ఇంతలో ఒక టన్నెల్ లో నుంచి ట్రైన్ వెళ్తోంది. బోగీ అంతా చీకటి. చిన్నా కేరింతలు కొట్టాడు.
జీవితం లో కూడా ఎప్పుడూ ముందుకు సాగాలి. వెనక్కి తిరిగి గతం లోకి వెళ్ళాలని అనుకుంటే భవిష్యత్తు చూపే కొత్త జీవితానికి దూరము అవుతాము.
నిరంతర కాలగమనం తో మనం కూడా ముందుకు సాగాలి.


కామెంట్‌లు