సాహితీబృందావనవేదిక 🦜ప్రక్రియ-సున్నితం--రూపకర్త -నెల్లుట్ల సునీత
***************************
2️⃣6️⃣6️⃣)
తెలంగాణా ఆడోళ్ళ పండుగ
పూలతో జరుగుతుంది నిండు
ఆనందాలు వెల్లివిరియ మెండుగ
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
************************
2️⃣6️⃣7️⃣)
తెలంగాణ ఔన్నత్యానికి ప్రతీక
దీనిపోరాటానికి తునక
ఆటపాటలతో అలరించెను చక్కగా
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************
2️⃣6️⃣8️⃣)
బ్రతుకమ్మ పండుగ సంబరాలు
తెలుగు సంస్కృతికి ఆనవాలు
కలిగించు ఆడవాళ్ళకు శుభాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************
2️⃣6️⃣9️⃣)
ఆస్వీయు జమాసాన జరిగేపండుగ
ఎంగిలిపూల బ్రతుకమ్మతో ప్రారంభం
సుద్దుల బ్రతుకమ్మతో ముగింపు
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************
2️⃣7️⃣0️⃣)
ఆటపాటలతో జరిగెను కోలాహలం
సిరిధాన్యాలు చేరుకలకాలం
గౌరీని గంగొడి చేర్చే సంబరం
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
బతుకమ్మ ;-భరద్వాజరావినూతల -కొత్తపట్నం జిల్లా -ప్రకాశం 9866203795
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి