కళాకారుని విజయం!...అచ్యుతుని రాజ్యశ్రీ

 భారతసామ్రాట్ స్కందగుప్తుడు   కళాపిపాసి.కవులు  నర్తకులు  కళాకారులను రప్పించి  ఉచిత రీతిలో సత్కారించేవాడు.ఆకాలంలో నిర్జరిణి ఓఅందాల నృత్యకళాకారిణి.ఆమెను తన సభలో ప్రధాననర్తకిగా నియమిస్తూ రాజసందేశం పంపాడు.ఇన్నాళ్లు తాను ప్రకృతిలో మమేకమై ఆడిపాడింది.స్వేచ్ఛగా నెమలిలాగా నర్తించింది.రాజాస్థానంలో నవరత్నాలున్నారు అప్పటికే!తనూ ఒక మనసున్న స్వేచ్ఛ కోసం పరితపించే కళాహృదయం. రత్నం అంటే ఆమె దృష్టి లో ఒక రాయి రప్ప!తనకళయే తనప్రాణం!కానీ రాజాజ్ఞను తిరస్కరించితే ఏమౌతుందో తనకి తెలుసు. అబల నిస్సహాయకావటంతో ఆనాటి పూర్ణిమనాడు రాజసభలోఅతిబలవంతంగా నాట్యప్రదర్శనకు ఒప్పుకుంటుంది. వీణావాదనంలో నిపుణుడైన ఆచార్య శశాంకుని దగ్గరకు రాజు సందేశంని తీసుకుని వస్తాడు వార్తాహరుడు.దాన్ని చూస్తూనే  ఆత్మాభిమానంతో రగిలిపోతూ అన్నాడు శశాంకుడు"నాకళ కేవలం ఈశ్వరుడి ఆరాధనకే!చక్రవర్తి సభలో రత్నంగా ప్రకాశించాలనే కోరిక నాకు లేదు. "
అంతే రాజు కి కోపం వచ్చింది. రాజుల మాటలు తేనెఊటలు!మెత్త మెత్తగా మాట్లాడి కఠినంగా శిక్షిస్తారు.వెంటనే శశాంకుని ఖైదులో పడేస్తాడు.కానీ నర్తకి నిర్జరిణి మాయోపాయంతో సామంతుడైన చంద్రసేనుని ఉంగరం తీసుకుని శశాంకుని బంధించినకారాగారం దగ్గరకు బయలుదేరినది.అది ఒక కొండపై ఉంది. ఆఉంగరాన్ని చూపి కాపలావారి అనుమతితీసుకుని శశాంకుని కలిసింది. "గురూజీ!నేను కూడా మీమార్గాన్నే అనుసరిస్తాను.కళాకారులు తమ ఆత్మానందం కోసం కళని అర్చిస్తారు.కళను పేరు పొట్టకూటి కోసం అమ్మరు.కళదైవదత్తం.స్వేచ్ఛ స్వతంత్రం కోరుకునే వారు  రాజభోగాలు వందిమాగధులను ఇష్టపడరు.నన్ను రాజు కారాగారంలో బందీచేసినాసరే నేను మీశిష్యురాలిని.మీరే నామార్గదర్శి!"అని ఆయనకి ప్రణమిల్లింది.ఆఇద్దరు కళాకారుల స్వాభిమాసం తెలుసుకున్న రాజు వారికి స్వేచ్ఛ ప్రసాదించాడు.కళాకారులు పశుపక్ష్యాదులు స్వేచ్ఛ కోరుతాయి.అలాగే పసిపాప లను కూడా ప్రేమగా దూరం నించే పలకరించాలి.కొత్త వారి ని చూసి పిల్లలు అమ్మ చీరకొంగులో దాక్కుంటారు.ఇంటికి వచ్చిన  బంధుమిత్రులు వారిని  బలవంతంగా ఎత్తుకోటం మొహం నిండా ముద్దులు పెట్టడం చాలా తప్పు. వారు కొత్త వారిని చూసి బిత్తరపోయి భయపడతారు. కొంత మంది అమ్మా నాన్న లు కూడా "మాపాప బాగా డాన్స్ చేస్తుంది. మాబాబు బాగా పాడుతాడు"అని ఇంటికి  ఎవరైనా రాగానే పిల్లలను బలవంతపెడతారు.వారు మొండి కేస్తే భయపెట్టడం బెదిరించడం "నీకు చాక్లెట్లు ఇస్తా "అని బుజ్జగిస్తూ పిల్లల ను నిర్బంధించటం మంచిది కాదు.
కామెంట్‌లు