మిడతం బొట్లు కథ చదివి నవ్వని వారెవరు ఉండరు
ఇప్పుడు మిడత బొట్లు ఎందుకు గుర్తొచ్చినట్లు అనుకుంటున్నారా?ఈరోజు మనం మిడత తయారు తయాయుచేసుకున్నాం కదా!పచ్చగడ్డిలో పచ్చగా ఎందుకొమ్మలో పుల్లలాంటి కాళ్లతో చెట్లతో కలిసి పోయి కనబడకుండా దాగి ఉండే మిడతను మిడతను మీరందరు చూసే ఉంటారు.వరి పొలాలపై
దాడి చేసే మిడతల దండు గురించి వినియున్నాం.
క్రీ.పూ. గ్రీసుదేశంలో ఎన్న ఈసఫ్ అనే బానిస రాసిన కథలు ప్రపంచ ప్రసిద్ధి గాంచాయి.ఈసఫ్ రాసిన కథలలో మిడతా గురించి రాసిన ఒక కథ చాలా పాపులర్.The Ant and the Grosshopper అనే ఈసఫ్ కథలో చీమ తన గుడును కట్టుకోవడంలో నూ
ఆహారం సంపాదించుకోవటం కోసం చాలా చాలా కష్టపడుతూ ఉంటుంది.మట్టిని తెచ్చి పుట్టను కట్టుకోవడం ఆహారాన్ని తెచ్చి ఒకచోట దాచుకోవటం చేస్తూ ఉంటుంది.అదే సమయంలో మిడత ,ఏ పని
చేయకుండా హాయిగా ఆడుతూ పాడుతూ కాలం గడిపేస్తూ ఉంటుంది.చివరికి వేసవి పోయి వానాకాలం రాగానే చీమ హాయిగా ఇంట్లొ కూర్చుని తింటుంటే మిడతేమో కష్టాలు పడుతూ ఉంటుంది.ఇది ఆకథ,ఎవరైనా ఒక విషయం మీద ,ఒక పని మీద సరైన శ్రద్ద పెట్టి పనిచేయలేకపోతే అలాంటి వారిని Grosshopper mind అంటారు.మిడతలు ప్రధాన పాత్రలుగా ఎన్నో సినిమాలు తీయబడ్డాయి. 1957 లో అనే సినిమా తీయబడింది.రాకాసి మిడతలను చికాగో నగరం మీద దాడిచేసినట్లు గా కథను రాసి సినిమాను తీశారు.ఆర్థోప్పిరా క్రమానికి, సిలిపెర ఉపక్రమనికి చెందిన కిటకం ఇవీ ఆకులు గడ్డి తింటాయి.ఆడ మిడతలు మగవాటికన్నా పెద్దవిగా ఉంటాయి.పచ్చి బఠాణీ కాయలు కొనుక్కొని గింజలు
వాలుచుకున్నాం తొక్కల్ని పారేయకుండా ఎండబెట్టాను. రెండు రోజులతర్వాత అవి ఎండి మిడతల ఆకారాన్ని సంతాయిచుకున్నాయి.వీటిలో నేను చేసిందేమీ లేదు కళ్ళు కోసం రెండు నల్లని చుక్కలు పెట్టడం తప్ప .పచ్చి బఠాణిల పెరు చెప్పగా
సైన్స్ విద్యార్థులకు వెంటనే ,మెండల్, అనే శాస్త్రవేత్త గుర్తుకు వస్తారు.గ్రేగరి మెండల్ అనే అస్ట్రయన్ శాస్త్రవేత్త 28,000 బఠాణి చెట్లపై ప్రయోగాలు జరిపి జన్యు శాస్త్రానికి ఆయువుపట్టైన, మెండల్ లాస్ ,ను
కనుగొన్నాడు. ఆ తర్వాత ఆధునిక జన్యుశాస్త్రం అభివృద్ధి చెందింది.వీటి నుంచి బయోప్లాస్టిక్స్ తయారు చేస్తారు.బఠాణి ఫాబేసి కుటుంబానికి చెందిన మొక్క దీని వృక్ష నామం' పైసమ్ సెటైవమ్', కాయల లోపల చిన్న గోళాకారపు విత్తనాలు వరుసగా చూడ చక్కగా అమరి ఉంటాయి.పచ్చి బఠాణిలను మనం బిరియని,ప్రయిడ్ రైస్, ఇంకా అన్ని రకాల కురాల్లోనూ వాడుతారు.ఎండి వేయించిన బఠాణిలను కాలక్షేపపు బఠాణి' లుగా
తింటుంటాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి