అక్షర మాల -గేయాలు :-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు

అమ్మ మనకి దైవం 
ఆమె మాట విందాం 
ఇంటి పనిలో సాయం 
ఈ రోజునుండి చేద్దాం!

ఉతికిన బట్టలు మడత 
ఊడ్చి ఇల్లు శుభ్రత 
ఋషి వలే నిశ్శబ్దత
ఎవరికైనా చేయూత!

ఏడవరాదు చీటికిమాటికి 
ఐకమత్యమే మహాబలము 
ఒద్దికతో చదువుకుందాం 
ఓర్పుగా ఎప్పుడూ ఉందాం!

ఔదార్యమును చూపాలి 
అందుకే దాతగా మారాలి!!

కామెంట్‌లు