బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 71) చెడును విస్మరించి మంచిని సంస్కరించి సంరక్షించుకోవడం యోగ్యతలక్షణం.
72) సవ్య వచనాలు విని ప్రయోజనం లేదు.వాటిని నిత్యకృత్యాలలో ఎంతవరకు ఆచరణలోకి తెస్తున్నామనేదే ముఖ్యం.
73) సరిగా వినియోగించుకుంటే పుస్తకాలంత మంచివి లేవు.సరిగా వినియోగించుకోకపోతే వాటంత నిరుపయోగమైనవి లేవు.
74) నరులపాలిట వరదేవత చదువే.
75) నీ శక్తిని గుర్తించడంలోనే నీ సామర్థ్యం ఉంది.
(సశేషము)


కామెంట్‌లు