తమిళ జగత్తులో తందై పెరియార్ (జననం : ఈరోడ్ లో 1879 సెప్టెంబర్ 17 - మరణం : వేలూరులో 1973 డిసెంబర్ 24) సుప్రసిద్ధులు. యావత్ తమిళనాడూ ఆయనను ఇట్టానే పిలిచేది. ఆయన సంఘసంస్కర్త. రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించారు. మొదట్లో కొన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అనంతరం జస్టిస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ద్రవిడ కళగం (డికె) పార్టీని స్థాపించారు. ఇది ఒక సామాజికోద్యమ సంస్థగా కొనసాగింది. స్వీయగౌరవ ఉద్యమ నేత. ద్రవిడ జాతీయ వాది. నాస్తికవాది. హిందీ వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నారు. పెరియార్ గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం...
ఆయన మొదటి భార్య నాగమ్మ 1933లో మరణించారు రెండవ భార్య మణియమ్మై 1973లో చనిపోయారు. ఈయన పూర్వీకులు కర్ణాటక ప్రాంత కన్నడ బలిజలు.
రామసామి అనేది ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు. స్త్రీ స్వేచ్ఛకోసం ప్రచారం చేయడానికి ఓ మహానాడు ఏర్పాటు చేశారు. ఈ మహానాడును ఏర్పాటు చేసిన మహిళలు ఆయనకు ఇచ్చిన బిరుదే పెరియార్. అదే ఆయన పేరుగా మారిపోయింది.
పెరియార్ - నాగమ్మ దంపతులకు ఓ బిడ్డ. కానీ పుట్టిన అయిదో నెలకే ఆ బిడ్డ చనిపోయింది. ఆ తర్వాత వారికి పిల్లలు కలగలేదు. కానీ ఇరవై మందికిపైగా అనాథలను దత్తతు తీసుకుని వారినీ పెంచారు. వారందరినీ చదివించి పెళ్ళిళ్ళు చేసే వరకు ఖర్చంతా పెరియార్ దంపతులదే.
తమిళనాడు చరిత్రలో ఓమారు జరిగిన తులాభారంలో పెరియార్ కి వెండి, ధాన్యం బస్తాలు, ఖర్జూరపళ్ళు, బెడ్ షీట్లు, ఉల్లిపాయలు వంటివన్నీ ఇచ్చారు.
ఆయన వేదికపై మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా భిన్నాభిప్రాయముంటే వెంటనే లేచి చెప్పవచ్చు అని ప్రకటించారు. నేను లేని చోట నా గురించి మాట్లాడకు. నేను కనిపించని చోట మొరగడం తగదు అన్నారు.
వాల్మీకి రామాయణం, అభిదాన చింతామణి, తమిళ్ పేరకరాది అనే మూడు పుస్తకాలను ఆయన ఎప్పుడూ తన దగ్గర ఉంచుకునేవారు. చర్చనీయాంశమైన పుస్తకాలపై వెనువెంట వెలువడే పుస్తకాలను తప్పక కొని చదివేవారు.
పదిహేను కుక్కలను పెంచారు. వాటిలో మేలుజాతి కుక్కలూ ఉండేవి. ఆయన ఎక్కడైనా వేరే ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అవి ఒక వ్యానులో వచ్చేవి. ఆయన వేదికపై ప్రసంగించేటప్పుడు అవి వేదిక కింద కూర్చునేవి.
తాను చేసే చిన్న ఖర్చులకు సైతం లెక్కాపత్రాలుండేవి. వాటిని ఓ డైరీలో రాసుకునేవారు. ఆదాయపన్ను సమస్య తలెత్తి కోర్టుకెళ్ళినఫ్పుడు అక్కడి న్యాయమూర్తులు ఈ డైరీలను చూసి ఆశ్చర్యపోయారు.
వారానికొకసారి, పది రోజులకొకసారో స్నానం చేసేవారు. "స్నానం చేయాలనే జ్ఞాపకమే నాకు రాలేదు. అదొక ఇబ్బందిగా అనిపించేది" అనేవారు.
తమిళంలో కొన్ని అక్షరాలు రాయడంలో మార్పులు తీసుకొచ్చారు. వాటిని డెబ్బై అయిదేళ్ళ క్రితం మొదటిసారిగా ఆయన రాసి వాడుకలోకి తెచ్చారు. (ணா, லை వంటి కొన్ని అక్షరాల మార్పు ఆయన చలవే).
యవ్వనంలో ఉన్నప్పుడు తాను చేసిన చేష్టలను బహిరంగంగా చెప్పుకున్నారు.
"దర్జాగా గడిపాను. కానీ మద్యం తాగిందిలేదు. కానీ పలువురికి కొనిచ్చాను. నేను వ్యాపారిగా ఉన్నప్పుడు అబద్ధాలు మాట్లాడి ఉండొచ్చు. ప్రజాజీవితంలోకొచ్చాక ఒక్క అబద్ధమూ చెప్పలేదు. అమర్యాద పనులూ చేయలేదు" అన్నారు.
"మీకు రాజకీయ వారసుడు ఎవరు?" అని అడిగినప్పుడు " రాజకీయాలలో నాకంటూ వారసులు లేరు. నా ఆశయాలు, అభిప్రాయాలే నా వారసులు" అని ఆయన జవాబిచ్చారు.
సెల్ఫోన్, కంప్యూటర్, వాక్ మాన్, వెబ్ కెమేరా, టెస్ట్ ట్యూబ్ బేబీ, ఆహార క్యాప్షుల్స్, కుటుంబ నియంత్రణ,....వంటి వాటి గురించి అరవై అయిదేళ్ళక్రితమే"ఇక రానున్న ప్రపంచం" అని ఓ వ్యాసం రాసి తమ వైజ్ఞానిక శాస్త్ర ఆలోచనలను వెల్లడించారాయన.
ఇద్దరు గవర్నర్ జనరల్స్ ఆయనను కలిసి 1940, 42 సంవత్సరాలలో చెన్నై పరిపాలనను చేపట్టమని కోరినప్పుడు సున్నితంగా తిరస్కరించారు పెరియార్.
నిప్పు చల్లదనం కావచ్చు...వేపనూనె తేనె కావచ్చు కానీ పదవీబాధ్యతలు స్వీకరించినతను యోగ్యుడిగా ఉండటం అసాధ్యం అని తనకా బాధ్యతలు వద్దన్నారు పెరియార్.
తన మనసుకు అనిపించింది ఏమాత్రం దాచిపెట్టకుండా చెప్పేవారు. అది ఏదైనా కావచ్చు. తమలపాకు దుకాణ వ్యాపారుల సంఘం వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ "మీవల్ల ఈ దేశానికి ఏ మంచీ లేదు. కనుక దుకాణాలను మూసి ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయండి" అని చెప్పారు.
తన కుటుంబ ఆస్తిని ప్రజాజీవితానికి ఖర్చు చేశారు. ప్రజాజీవితంలో లభించినదానిని అందరికీ ఉపయోగపడేలా ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. తన సేకరణలో ఒక్క నయిపైసాకూడా తమ కుటుంబంకోసం వాడుకోలేదాయన.
ప్రముఖులు ఎవరొచ్చినా వయోభారంతో అవస్థ పడుతున్నా లేచి నిల్చునేవారు. యువకుడినైనా "రండి, వెళ్ళిరండి" అని గౌరవంగా సంబోధించేవారు.
ఏ కార్యక్రమమైనా కావచ్చు దైవ ప్రార్థనా గీతాన్ని ఎవరు ఆలపించినాసరే లేచి నిల్చునేవారు. ఎవరు తీర్థమిచ్చినా స్వీకరించేవారు.
"నేను చెప్పేవాటన్నింటినీ నమ్మకండి. మీ మనసుకు సరి అని అన్పిస్తేనే స్వీకరించండి. నేను నా లక్ష్యాన్ని మారుస్తూ ఉంటాను. అయితే ఎప్పుడు మారుస్తానో తెలీదు..." అని అన్ని సభలలోనూ తప్పక చెప్పేవారు పెరియార్.
ఆయన మిత్రులలో ఎనిమిది మంది 42 ఏళ్ళకు మరణించారట. తానూ ఆ వయస్సుకే చనిపోతానని అనుకున్నారట. కానీ ఆ తర్వాత ఆయన తీవ్రస్థాయిలో ప్రజాజీవితానికి అంకితమయ్యారు.
ఆధునిక దీర్ఘదర్శి. దక్షిణాసియా సోక్రటీస్ అని యునెస్కో తనకు ఓ ప్రశంసాపత్రం ఇచ్చినప్పుడు "ఈ మాటలను స్వీకరించడానికి సిగ్గుపడుతున్నాను" అన్నారాయన.
ఆయన ఊతపదం - వెంగాయం (ఆంటే ఉల్లిపాయ). ఉల్లిపాయను వొలుస్తూ పోతే చివరికి ఏమీ మిగలదు. ఏమీ లేని వారిని ఆ విధంగా ఉద్దేశించడానికి ఆ మాట ఉపయోగించేవారు.
ప్రత్యక్ష వివాదాంశాలప్పుడు "చెప్తున్నందుకు మన్నించండి" అని చెప్పే జవాబిచ్చేవారు.
95వ ఏట సైతం ఆయన 35 రోజులు వివిధ ప్రాంతాలకు వెళ్ళి 42 సభలలో ప్రసంగించడం విశేషం. చివరగా ఆయన ప్రసంగించిన చోటు చెన్నైలోని టీ.నగర్. ఈ చోట్లోనే పెరియార్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి