శ్రీకాంత్ చాలా ధనవంతుల అబ్బాయి. తరగతిలో మొదటి ర్యాంకు రావడమే కాక ప్రతిరోజూ ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ తెచ్చి స్నేహితులకు పంచేవాడు. అవి ఆరోగ్యానికి ఎంత అవసరమో తెలుపుతూ అందరి చేత తినిపించేవాడు. శ్రీహరి కూడా ధనవంతుల అబ్బాయి. తల్లిదండ్రులు ఇచ్చే అవకాశంపాకెట్ మనీతో క్రమం తప్పకుండా రకరకాల కథల పుస్తకాలను కొని, స్నేహితులకు పంచేవాడు. మంచి దారిలో నడవాలంటే కథల యొక్క ఆవశ్యకత ఎంతో వివరిస్తూ వాటిని చదివింపజేసేవాడు. శ్రీరమణ తన తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీతో బయట దొరికే సమోసాలు, బజ్జీలు, పిజ్జాలు, బర్గర్ల వంటివి కొని, స్నేహితుల చేత తినిపించే వాడు. శ్రీరాం తన తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ స్నేహితులకు పంచేవాడం. పాండు తన అమ్మా నాన్నలు ఇచ్చే పాకెట్ మనీతో రకరకాల ఆటవస్తువులు కొని స్నేహితులతో రోజూ రెండు గంటలు ఆటలతో కాలక్షేపం. అతనికి చదువు అసలే అబ్బలేదు. ఇలా ఆ తరగతిలో ప్రతీ విద్యార్థికీ ఏదో ఒక ప్రత్యేక గుణం ఉండేది.
సత్యం నిరుపేద విద్యార్థి. అతను చదువులో రెండవ ర్యాంకు వచ్చేవాడు. కానీ అతని పేదరికాన్ని హేళన చేస్తూ కొంతమంది నవ్వుకునేవారు. అతని పేదరికం కారణంగా అతనితో స్నేహం చేయని వారు కొందరు. అయినా సత్యం ఇవేవీ పట్టించుకోలేదు. ప్రతిరోజూ సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదివేవాడు. తోటి మిత్రులను ప్రోత్సహించేవాడు.
అందరి పదవ తరగతి చదువు పూర్తి అయింది. ఇంటర్మీడియట్ నుంచి వేరు వేరు ప్రాంతాల్లో చదువుతున్నారు. కాల క్రమంలో మరో పదిహేను సంవత్సరాలు గడిచాయి. ఒక్కొక్కరు వివిధ వృత్తుల్లో, ఉద్యోగాలలో స్థిరపడిపోయారు. పూర్వ విద్యార్ధుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కలెక్టరుగా వచ్చిన సత్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరో ఏడుగురు ఉన్నత ఉద్యోగాలు సాధించారు. చదువులో సగటు విద్యార్థులు ఇంత గొప్ప ఉద్యోగాన్ని ఎలా సాధించారా? అని ఆశ్చర్యపోయాను అందరూ. అప్పుడు ఆ ఏడుగురిలో రాము అనే విద్యార్థి మాట్లాడుతూ "మన బ్యాచ్ ప్రత్యేకత చాలామంది ప్రతిరోజూ తోటి మిత్రులకు ఏవేవో పంచేవారు. కానీ సత్యం మాత్రం మా అందరికీ విద్యను పంచాడు. మీ అందరికీ ఆశ్చర్యంగా ఉండవచ్చు. మన ఊరి బయట రంగయ్య తోట అందరికీ తెలుసు. ఆ రంగయ్య ఎంత కఠినంగా మాట్లాడేవాడో అందరికీ తెలుసు. కానీ మన సత్యం రంగయ్యతో స్నేహం చేశాడు. ప్రతి సెలవు రోజూ మేము ఎనిమిది మంది తోటలో కూర్చొని చదువుకునేవాళ్ళం. సత్యం ప్రతి సబ్జెక్టులో మాకు తెలియని విషయాలను అర్థం అయ్యేలా చెప్పేవాడు. అలా అందరం తెలివైన విద్యార్థులం అయినాము. ఆ రోజుల్లో పదవ తరగతిలో మేము సాధించిన మార్కులు చూసి ఆశ్చర్యపోయి, చూచి రాయడం వల్ల గొప్ప మార్కులు సాధించామని చాలామంది అనడం మాకు తెలుసు. కానీ సత్యం పుణ్యమా అని తెలివైన వాళ్ళం అయ్యి గొప్ప ఉద్యోగాలు సాధించాము." అన్నాడు.
అందరూ సత్యాన్ని అభినందించారు. ఆ రోజుల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు క్షమాపణ చెప్పారు. అన్ని దానాలలో కన్నా విద్యా దానం గొప్పది. అది ఎందరి భవిష్యత్తుకో బంగారు బాటలు వేస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి