జ్ఞాపకాలు : టి. వేదాంత సూరి


 జ్ణాపకాలు మనలను నిరంతరం వెంటాడుతుంటాయి. నిన్న నేడొక జ్ఞాపకం, నేడు రేపొక జ్ఞాపకం, ఇవి మనిషి మనసును నిరంతరం తొలుస్తూనే ఉంటాయి. ఇక్కడో విషయం చెప్పాలనిపించి ఇలా ప్రారంభించాను. మనం అనుభవిస్తున్న కాలానికంటే గతం మధురంగా ఉంటుంది. భవిష్యత్హు ఆశాజనకంగా ఉంటుంది. ఆక్లాండ్ కు ఐదేళ్ళ క్రితం ఆద్య పుట్టినప్పుడు వచ్చాం . ఇక్కడ లీనఫిల్డ్  96 ఇంట్లో చాలా రోజులే గడిపాము, . దగ్గర ఒక పార్క్ దానికి ఆద్య పెట్టుకున్న పేరు ఫోటోల పార్క్ అని. ఎందుకంటె అక్కడ ఆద్య మొదటిసారిగా కుటుంబ సభ్యులమంతా తీసుకున్న ఫొటోకు గుర్తుగా ఆద్య పెట్టుకున్న పేరు. దానికి సమీపం లో పిల్లల ఆట  స్థలం , కౌంట్ డౌన్ సూపర్ మార్కెట్. .. ఇక మరో వైపు ఒక స్కూల్ ముందు పెద్ద మైదానం, దాని వెనుక సముద్రం, రోడ్డుకు ఇరు వైపులా ఆహ్లాదంగా పలుకరించే చెట్లు, పూలు,, చల్లని గాలి. ఉదయం, సాయంకాలం పిల్లలతో కలిసి నడక .. ఈ వాతావరణాన్ని ఎలా మరిచిపోగలం. అన్ని కొండలపైన ఇళ్ళు కావడం  వలన మనోల్లాసంగా ఉంటుంది.. కొత్తగా ఇల్లు మారాక చాలా రోజుల తరువాత ఇటువైపు వచ్చాం, ఎన్నెన్నో జ్ఞాపకాలను వెతుక్కున్నాం. ఈ కాలం ఒక ప్రవాహం, దాన్ని ఆస్వాదించడమే తప్ప నిలువరించలేము కదా. అయితే నేత్రాలు తీసిన ఫోటో మాత్రం ఎదలో పదిలంగా ఉంటుంది. దాన్ని కదిలిస్తే అక్షరాలుగా రూపాంతరం చెంది మీ ముందుకు వచ్చాయి. అంటే ఆ కాలం ఒక జ్ఞాపకం . 

కామెంట్‌లు
Unknown చెప్పారు…
నేత్రాలు తీసిన ఫోటోలు చాలా పదిలం అనడం ఎంతో బాగుందండీ... - జంధ్యాల శరత్ బాబు, అరసవల్లి- ఆంధ్రప్రదేశ్
జంధ్యాల శరత్ బాబు చెప్పారు…
చాలా బాగుంది