శ్రీమతి సమ్మెట ఉమాదేవిగారి"మా పిల్లల ముచ్చట్లు" అచ్యుతుని రాజ్యశ్రీ
 నాకు చాలా నచ్చిన  అందరూ ముఖ్యంగా ఆమ్మా నాన్నలు పిల్లలు చదవాల్సిన పుస్తకం "మాపిల్లలముచ్చట్లు."నాకు తెలీని ఎన్నెన్నో విషయాలు!జేగంటగా రైలు పట్టాలను బడిగంటగా తండా పిల్లల చైతన్యం గా పల్లెబడి వాస్తవ చిత్రణకళ్లెదుట పెట్టారు ఆమె."మమ్మల్ని విడిచిపోకుమా!మా!అమ్మా!"అనే పిల్లల ప్రేమ ఆప్యాయత చదివితే కళ్ళు చెమరుస్తాయి ఏ టీచర్ కైనా!ఉమగారు ఒక టీచర్ సైకాలజిస్ట్ మంచి రచయిత్రి. అంగన్ వాడీలు తండాపిల్లల ఇక్కట్లు  టీచర్లపాట్లతో పాటు నిర్మొహమాటంగా నిస్సంకోచంగా లోటుపాట్లు  వాటి పరిష్కారం కూడా ఆమెసూచించారు.అలా అనుసరిస్తే!?కానీ అంత తీరిక ఓపిక శ్రద్ధ ఎందరికి ఉంది?సాధ్యమా?ఇక పుస్తకంలో  ప్రతిపేజీ పిల్లలఫోటో కంటికి శ్రమకలిగించని పెద్ద అక్షరాలతో ఒక కథ చదివిన అనుభూతి కలిగింది. తండాపిల్లల పాలిటి వటవృక్షంగా నిలిచిన ఆమె  తండాలవనాల పసిమొగ్గలు గడ్డిఅడవిపూలబాలలతో పూమాలలుఅల్లి శ్రీవిద్యామాతను అలంకరించారు. ఒక పరిశోధనా పొత్తం! ఇకవిహంగవీక్షణం చేస్తాను.
భాసిత్ నగర్ ప్రాధమిక పాఠశాల అనుభవాలు రిటైర్ అయ్యాక రాసిన వాక్యాలు కంటనీరు తెప్పిస్తాయి.ప్యూర్ సంస్థ చేయూత గూర్చి వివరించారు. తక్కువ సర్వీసు ఎక్కువ అనుభవాలు ఆనందంని పల్లెతల్లి ఒడిలో తండాబాలల మోముల్లోపొందిన మధుర స్మృతులు!తన ముగ్గురు కన్నబిడ్డలను అమ్మా నాన్న ల సంరక్షణలో వదిలి ఉద్యోగం కే అంకితం అయ్యారు. రవాణా సౌకర్యాలు లేని పల్లెలు రైలు బస్సు నడకతో ఉదయం 6కి ఇల్లు వదిలితే రాత్రి 8-9మధ్య  ఇల్లుచేరినా మొహాన చెరగని చిరునవ్వుతో ప్రతి ఫోటోలో కనపడటం నాకు వింత ఆశ్చర్యం ఆనందంగా  అనిపించింది. ఖర్చు ఆర్ధిక సంక్షోభంలో కూడా అంగన్వాడీ బుడతలు మొదలు టీనేజ్ పిల్లల ప్రేమ ఆప్యాయత ఆమెకి బలం ఊతం ఇచ్చాయి కాబోలు!ఇకసరిగ్గా ఏడాది చివరి పరీక్షలు పొలంపనులు ఒకేసారి కావటంతో అధ్యాపకులపాట్లు నిజంగా బాధ కలిగించే విషయం!తెలుగు ఆంగ్లం సోషల్ చెప్పి పిల్లల మానసిక శారీరక వికాసానికి చేపట్టిన పనులు అందరికీ అనుసరణీయం!గిరిజన సంస్కృతిని బాగా అధ్యయనం చేశారు. కధారచయిత్రిగా ఎన్నో బహుమతులు  ఖమ్మం జిల్లా ఉత్తమ న్యూస్ రీడర్ గా పురస్కారం అందుకున్న ఈమె ఎదిగిన కొద్దీ ఒదిగిన జీవితం!ఇంకా పల్లెబస్సులరాకపోకలు సరిగ్గా ఉంటే  పల్లెల్లో బాలలకి కడుపు నిండా తిండి దొరికితే బడి నిండుగా ఉంటుంది. పల్లెల్లో పిల్లలు బాల్యంనించే ఢక్కామొక్కీలలో సంసార బాధ్యతలు బరువు మోస్తున్నారు. ఇంటాబైట అమ్మా నాన్నల చెప్పుచేతల్లో ఉంటూ తనపై కురిపించిన ప్రేమ ఆప్యాయతలను మన ఎదుటనిలబడి చెప్పుతున్న అనుభూతి కలిగించారు ఉమగారు. ఇంకా ఆమె చెప్పిన కఠోర సత్యాల గూర్చి తెలుసు కుని తీరాలి.
 తన 21ఏళ్ళ అధ్యాపకవృత్తిలో ఆమె గమనించిన లోటుపాట్లు ఇవి-తండాపిల్లలు బడికి సక్రమంగా రాకపోటానికి కారణాలు అనేకం.ఆపిల్లల కుటుంబ పరిస్థితులు బడికి 3 కి.మీ.పైగా నడిచి రాకపోకలు ఆటో బస్సు తో చార్జీలకి పైసలు కొరత పొలంపనులకి బాల శ్రామికులుగా వెళ్లితే నోటికి బువ్వ అందుతుంది. ఎండలో ర్యాలీ పేరుతో పిల్లలు అలసిపోతారు. కట్టెల పొయ్యి వాడకం తో క్లాస్ లోకి  పొగవస్తుంది. మంచినీరు మరుగుదొడ్లు సౌకర్యాలు అంతంతమాత్రమే. గాలీవెల్తురు వచ్చేగదులు లేకపోటం ఇంగ్లీషు మీడియం బడికి మగపిల్లలని పంపుతారు.ఆడపిల్ల ఊరిబడిలో చదివి పెళ్లితో మానేస్తుంది.అంగన్వాడీలను బాగా బలపరిచి కె.జి.క్లాసులుపాస్ కాగానే ప్రాధమిక పాఠశాలలో అక్కడే చేర్చాలి. ఇక పాఠాలు ఆటపా టలుగా డ్రామా గా చెప్పి చేయిస్తే త్వరగా నేర్చుకుంటారు. క్లాస్ లో పిల్లల చేత పెద్దగా చదివించి పదాలు అంటూ రాయించాలి.కులధృవీకరణ పత్రాల కోసం మండల జిల్లా ఆఫీసులచుట్టూ తిరగకుండా  బడికే ఫీల్డ్ ఆఫీసర్ క్లర్కు  కెమెరామెన్ వస్తే ఉభయ తారకం.లెక్కలు సైన్స్ ఇంగ్లీషు పై దృష్టి పెట్టడంతో హిందీ తెలుగు  మాట్లాడే రాసే స్థితిలోచాలా వెనుకబడి ఉన్నారు. నల్లబల్ల పై రాయించాలి పిల్లలతో!ఇక ఆమె తనవంతు కృషిని గూర్చి ఇలా ప్రస్తావించారు. ఖమ్మం జిల్లా బాలికలవిద్యాభివృద్ధి అధికారిణిగానే కాక ముందు మధిర బాలికోన్నతపాఠశాలలో పనిచేసిన ఆమె అక్కడి లోటుపాట్లు గమనించారు.ప్యూర్ సంస్థ చేయూతతో బెంచీలు అన్నంప్లేట్లు గ్లాసులు 35సైకిళ్ళు టి.వి.స్కూల్ బ్యాగులు  కుట్టుమిషన్ అమర్చగలిగారు. ముఖ్యమైనకాగితాలు దాచుకునేందుకై ఫోల్డర్లు లోదుస్తులు చెప్పులు గొడుగులు  జాతీయ పండుగలకి తెల్లయూనిఫాం ఇప్పించారు. 10వక్లాస్ పిల్లలు తమకు పనికిరాని యూనిఫాం నిఇస్తే  దాన్ని సద్వినియోగం చేశారు.  ఇక తొలిసారి బస్సులో  కొత్తగూడెం రేడియో స్టేషన్ లో పిల్లల ప్రోగ్రాం చేయటం విహారయాత్ర కి తీసుకుని వెళ్లటంతో పిల్లల ఆనందం అంబరాన్ని తాకింది అంటారామె.ఖమ్మం లో టోర్నమెంట్లలో మధిర నించి పిల్లలని రైలులో  తీసుకుని వెళ్లి తే  తొలిసారి ప్రయాణంచేసిన పిల్లల అనుభూతి మాటల్లో చెప్పలేము.మొబైల్ హాస్పిటల్ బడికి తరచూ వస్తే మంచిది అని  ఉచితంగా రాతకి నోట్ బుక్స్ ఇస్తే పిల్లలు మంచి చేతిరాతతో మార్కులు ఎక్కువ తెచ్చుకోగలరు అనేది నిత్య సత్యం!లాబ్ లో సైన్స్ పరికరాలు  కంప్యూటర్స్ పనికిరాకుండా పడుంటున్నాయి.ఇదిశోచనీయం.పాన్ చాక్లెట్లు  ఇతర తినుబండారాలకి డబ్బు ఇచ్చే అమ్మా నాన్నలు చదువు పై దృష్టి పెట్టరు.ఇది శోచనీయం.
ఇంకో వింత ఏమంటే జనాభా సర్వేలో తేలిన విషయం-దాదాపు గూడెంలలో  టి.వి. సెల్ ఫోన్  బండి  ఉన్నాయి కానీ గ్యాస్ పొయ్యి  మరుగుదొడ్లు ఉండవు.పిల్లల కి కడుపు నిండా తిండి దొరికితే బడి మానరు అని ఇంట్లో  పరిస్థితుల వల్ల పిల్లలు మానసికంగా దెబ్బ తింటారు అనేది ఆమె సర్వేలో తేలింది. ఇక తండాపిల్లల లో సృజనాత్మకత ఆప్యాయత ఎక్కువ. అడవిపూలతో అందమైన పూలబొకేలు పూలజడలుతయారు చేస్తారు. ఆకులతో చేతివాచీలు చేసి ధరించి మురిసిపోతుంటారు. సైన్స్ సోషల్ బొమ్మలు చక్కగా ముగ్గు రూపంలో చిత్రిస్తారు.మాక్ ఎన్నికలు నిర్వహించారు పిల్లలు. అలాగే స్వయంగా కధలు పాటలు బంజారా తండా ఆటలు పండుగలు బడిలో ప్రదర్శించుతారు.ఇంతలోతుగా  పల్లెలు తండాల పిల్లల జీవితాలు వారి బడి చదువు గూర్చి అధ్యయనం చేసి నిర్మొహమాటంగా సూచనలు చేసిన  ఉమగారిలాంటి వారు ఊరికొక్కరు ఉంటే!?ఇక ఆమెకు లభించిన అవార్డ్స్-మాడభూషి  రంగా చార్య  గోవిందరాజు సీతాదేవి ది తెలంగాణా ఉత్తమ సాహితీ అవార్డులు నందివాడ  శ్యామల పురస్కారం  అమృత లత గారి అపూర్వ విద్యా పురస్కారం! కానీ పిల్లల ప్రేమ ఆప్యాయత ఆమెకి వెలలేని కానుకలు!స్థలాభావం వల్ల చాలా విషయాలు రాయలేదు. ఆమె జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ అందుకోవాలని ఆశిద్దాం.

కామెంట్‌లు
మీ సమీక్ష అద్భుతంగా వుంది.. పుస్తకానికి వన్నె తెచ్చింది