యాభై ఏళ్ళుగా సముద్రంలో తేలియాడిన ఓ ఉత్తరం సంగతిది.
సముద్రంలోకి విసిరేసిన వ్యక్తికే ఆ ఉత్తరం తిరిగీ ఆ ఉత్తరం చేరిన సంగతిది.
ఇంతకూ ఆ ఉత్తరంలో రాసి ఉన్న విషయం ఏమిటో చూద్దాం...
అది 2019.
యాభై ఏళ్ళుగా ఆస్ట్రేలియాలో సముద్రంలో తేలియాడిన ఓ ఉత్తరం ఓ కుర్రాడి కంట పడింది. దక్షిణాస్ట్రేలియాలోని టాలియా సముద్రతీరాన తొమ్మిదేళ్ళ ఎలియట్ కు ఓ సీసాలో దొరికింది. అతను తన తండ్రితో కలిసి సముద్రంలో చేపలు పట్టడానికి వస్తాడు. తండ్రి పేరు పాల్ ఎలియట్. అప్పుడా కుర్రాడికి ఈ సీసా దొరికింది.
ఆ కుర్రాడు సీసా మూత తీసి లోపల ఉన్న ఓ కాగితాన్ని చూశాడు. దానిని బయటకు తీసి చదివాడు. ఆ మాటలు అతనిని ఆశ్చర్యపరిచాయి.
"నా పేరు పాల్ గిల్మోర్. నాకు పదమూడేళ్ళు. ఇంగ్లండు నుంచి మేము మెల్బోర్న్ కి పోతున్నాం. ఇప్పుడు ఓ నౌకలో ఉన్నాను. ఈ నౌక పేరు TV Fairstar, SitmarLine. ఈ ఉత్తరాన్ని నేను నేను ప్రయాణిస్తున్న నౌకలో నించే రాస్తున్నాను. ప్రస్తుతం పశ్చిమ ఆస్ట్రేలియాలో Fremantle అనే ప్రాంతానికి వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్నాం. ఓ సీసాలో దీనిని ఉంచి సముద్రంలోకి విసిరేస్తున్నాను. ఎవరికైతే ఈ ఉత్తరం లభిస్తుందో వారు దయచేసి ఈ ఉత్తరానికి జాబు రాయగలరు" అన్నదే ఆ ఉత్తరం సారాంశం.
ఈ ఉత్తరం రాసిన వ్యక్తి పేరు గిల్మోరా. అప్పుడు పాల్ గిల్మోర్ వయస్సు పదమూడేళ్ళు. గిల్మోర్ 1969 నవంబరు 17వ తేదీన ఈ ఉత్తరం రాశారు.
ఆ ఉత్తరం చదివిన ఎలియట్ వెంటనే గిల్మోర్ కు ప్రత్యుత్తరం రాయాలను కుంటాడు. కానీ ఏం రాయాలో అని తండ్రిని అడుగుతాడు. తండ్రి చెప్పినట్టే ఎలియట్ ఉత్తరం రాస్తాడు. అనంతరం ఆ ఉత్తరాన్ని ఎలియట్ ఓ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తాడు. అది చదివిన పాఠకులు ఈ విషయాన్ని పరస్పరం పంచుకుంటారు. ఇలా ఒకరికొకరు చెప్పుకుంటున్న క్రమంలో ఈ విషయం గిల్మోరా దాకా వస్తుంది.
అది గిల్మోరాకు అంతులేని ఆనందా న్నిస్తుంది. దానిపై అతను స్పందిస్తాడు.
"నేను ఏదో సరదాకొద్దీ ఉత్తరం రాసి ఓ సీసాలో ఉంచి సముద్రంలోకి విసిరాను....ఈ ఉత్తరం తిరిగీ నికే చేరింది. ఇది తలచుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉంది...." అని గిల్మోరా రాస్తాడు.
ప్రస్తుతం గిల్మోరా వయస్సు అరవై దాటింది. ఇంగ్లీష్ మాష్టారుగా ఉండి రిటైరయ్యారు. తన భార్యతో కలిసి సుఖసంతోషాలతో జీవితం సాగిస్తున్నారు.
ఈ దశలో ఇప్పుడీ సంఘటనతో బలేగా ఉందని, ఊహించలేకపోతున్నానని అంటారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి