బతుకమ్మ;-సరోజన బోయిని

 తెలంగాణ ఆడ బిడ్డల ఆత్మగౌరవ ప్రతీక.
ఎన్నో కట్టాలు ఎల్లవోసిన ఆడబిడ్డల కథలు
బతుకమ్మ ఏండ్ల నాటి సరిత్ర(చరిత్ర) ఉన్న మన సంపురదాయకపు( సాంప్రదాయం) ఆట
గిది మన సంస్కృతికి నిదర్శనం.
ఎనకట నవాబులు,భూస్వాములు,పెత్తందారుల తనంలో ఆడబిడ్డలు పడ్డ ఆగసాట్లు అంత,ఇంత కాదు.
ఆళ్ల పెత్తనంతో సెరవట్టిన ఆడిబిడ్డలు అరిగోస వడ్డరు.
గాళ్లకింద ఆత్మగౌరం సంపుకోలేక  బలిమీటికి పానాలు తీసుకున్నారు.
కండ్ల ముందే గట్ల ఆడబిడ్డల పానాలు బలిమీటికి పోతాంటే.ఎమ్ సెయ్యలేక దుర్బరంగ బతికిన బతుకులు మనవి.
పోరాటాల పలితం ఆళ్ల సెరనుండి విముక్తి పొంది మన  తెలంగాణ మనకు అచ్చింది.
వాళ్ళ సెరలో నేల రాలిన ఆడిబిడ్డల బ్రతుకులకు ప్రతీకగా పువ్వులను పేర్సి  ఆ పువ్వులలో  బతుకు అని  ఆడే ఆట బతుకమ్మ.
గిది మన తెలంగాణ ఆడబిడ్డల పండుగ.
గిది ప్రకృతిని కొలిసే పండుగ
తీరొక్క పువ్వుతోని ముద్దుగా పేర్సు కొని సంబురంగా తొమ్మిది దినాలు ఆడే పండుగ
ఎక్కువ లేదు, తక్కువ లేదు,  సిన్న,పెద్ద అందరు కలిసి అన్ని కులాలు ఒక్కకాడ కూడి ఆడుకునే  ఆట,గీడ ఉన్నోడు లేడు, లేనోడు లేడు అందరు కూడి  సంబురంగా ఆడుకునే ఆట.
పల్లె జానపదం ఎలుగెత్తి సాటే ఆట,పాట.
బతుకమ్మను పనికి రాని పువ్వు లేదు అన్ని పువ్వులను పేర్సి మొక్కే పండుగ.
ప్రకృతిలో వుండే ఏ పువ్వు అయిన పేర్సుడే.
ఇంటి,ఇంటికి సంబురంగా కొత్త బట్టలు,అప్పాలు,సత్తులు అన్నిటితోని  ఉన్నోనికి,లేనోనికి అందరికి సమానమైన పండుగ.
ఇంట్ల ఆడబిడ్డ లెక్కనే బతుకమ్మ గూడ.
తొరొక్క పువ్వుతోని పేర్సి జానపదం తో కూడిన పాట పాడుకుంటా సుట్టు తిరుగుకుంట సప్పట్లు కొట్టుకుంటూ ఆడుకొని.
మల్లచ్చే ఏటి దాక మమ్ముల సల్లగా సూడమని మల్లచ్చే ఏటికి మల్ల రా గౌరమ్మ  అని పారే నీళ్ళల్లో సాగదోలే పండుగ.

కామెంట్‌లు