అక్షర మాల - బాల గేయం ( శ గుణింతం );-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
 శక్తిని మించిన పనిచేయకు 
శాకాహారం ఆరోగ్యకరం 
శిరిడి సాయి నిరాడంబరుడు 
శీతలపానీయాలు హానికరం 
శుభాకాంక్షలు సంతోషమిస్తాయి
శూరుడు యుద్ధంలో గెలుస్తాడు 
శృతిలయలు సంగీతానికి ప్రాణం 
శెనగలు వాయనం శ్రావణమాసం 
శేషము వరకు లెక్క చెయ్యాలి 
శైవమతoలో విభూతి దాల్చాలి 
శొoటి అల్లంతో చేస్తారు 
శోధనయే సైన్స్ గా మారింది 
శౌర్య చక్ర సైనిక అవార్డు 
శంకలు ఉంటే పెద్దలనడగాలి!

కామెంట్‌లు