పసిపిల్లలు(బాల గేయం)ఎడ్ల లక్ష్మిసిద్దిపేట

పసిపిల్లల మనసులో
పసిడి కాంతులు
పసి వారి మాటలు
బ్రహ్మ పలికే పలుకులు

చిట్టి పాపల కళ్ళల్లో
వెన్నెల వెలుగులు
పసిడి బుగ్గల లో
ముసి ముసి నవ్వులు

పిల్లల అడుగులు
తడబడు నడకలు
బ్రతుకు బాటలు
అవే వారి పూదోటలు

అందమైన పాపలు
కుందనాల బొమ్మలు
అనురాగ బంధాలు
అమ్మా నాన్నల ఆశయాలు

కామెంట్‌లు