మాత భవాని!;- త్రిపురారి పద్మ-జనగామ.

 పల్లవి::
కనులు మూసి నిను తలచినంతనె
వినిపించెను నీ మువ్వల సడులు
జనని!కాత్యాయని!నీ కరుణ
సంద్రమై నను చేరెనా భవాని.

చరణం::
కుంకుమ చేతబూని అర్చన చేయగనె
కనిపించెను నీ కలువ కన్నుల సిరులు
మాత!పార్వతీ!ఈశుని రాణి!
నను దయజూడవె శివానీ!
చరణం::
పసుపు పారాణి నీకిడినంతనె
మనసు చీకటి తొలగె భవాని!
విరిసిన సుమములన్ని 
సుధలు కురిసె
నీ పలుకుల తేనెగ వారిజాసనీ!
చరణం::
శ్రీచక్ర వాసిని!మాత!దేవి!సుందరీ!
నందన వనమాయెను నా మనము
నిను గాంచిన సంతసమున తడిసి
కరుణించవె శైలజ!గిరిజ!పావనీ!
చరణం::
రవి కిరణములె హారతి కాంతులై
వెలిగెనీవేళ సతీ!హైమవతీ!
హిమనగమంటి చలువ పంచవె
శ్రీకరి!శుభకరి!వేదరూపిణీ!

    
కామెంట్‌లు