పల్లెటూళ్ళు మల్లె తీగలు;-సరిత రవి- కలం స్నేహం
బంధాలను పెంచే తీగ ల్లాంటివి ఈ పల్లెలు...

ప్రతి ఒక బంధం వదలలేని అనుబంధపు..
పచ్చని...పందిరి...
చూడటానికి చాలా సుందరమైనవి..

సంస్కృతి సాంప్రదాయాలకు
పల్లె ప్రజల జీవితాలు పట్టుకొమ్మలు....

స్వార్ధపు బ్రతుకులు తెలియవు...
మంచి చెడు భయం లేదు...
గిరుల మధ్యలోంచి పారే నీళ్ళు....
ఎన్నెన్నో రకాల చెట్ల వేర్లు....తేనెతో నిండిన తేనె పట్టులు...

పారే నీటిలో పారాడే చేపలు..
కూసే కోకిలలు, నాట్యం చేసే నెమళ్ళు, తిరుగాడుతూ ఉండే పశుపక్షాదులు,భూమి తల్లిని పూజిస్తూ,
భూమి త్లలి ఒడిలో జీవించే పల్లె ప్రజలు...

పల్లెటూరి వారి జీవనం..
కల్పనకు కూడా దొరకని అందము...

మంచు బిందువుల శబ్దం..
పక్షుల కిలకిలల...
వినడానికి చూడడానికి
చాలా అందం ఆనందం...

ఉదయాన్నే వచ్చే సూర్య కిరణాలు... 
సాయం

త్రమైతే సంధ్యరాగాలు,రాతిరి వెన్నెల పరదాలు....
అమావాస్య వెలుతురులో మెరిసే మిణుగురులు,
పల్లెకు పట్టుకొమ్మలు...

బంధాలు, బంధుత్వాలు పెంచుకుంటూ 
ఏ కల్మషము లేని 
పల్లెలు, మన అందరికి ఆదర్శంగా నిలిచే ఆయువుపట్లు....

పల్లెలు ప్రగతికి సోపానాలు....

కామెంట్‌లు
అల్లాడి వేణుగోపాల్ చెప్పారు…
పల్లె ప్రేమ
స్వర్గ సీమ

అల్లాడి వేణుగోపాల్