సు (నంద) భాషితం-- *విమర్శ*-- *సునంద వురిమళ్ల,ఖమ్మం*
 *ఎవరో విమర్శించారని భయపడి,బాధ పడి తలపెట్టిన మంచి పనిని మానేయవద్దు.*
 *విమర్శ  ఎప్పటికప్పుడు వెన్నుతట్టి ప్రోత్సాహించే ప్రశంస అనుకోవాలి. అప్పుడే మనలో మరింత పట్టుదల పెరుగుతుంది.*
*కత్తిరించడం చేత పూల చెట్లు వివిధ అకృతుల్లో శోభాయమానంగా కనిపించడం చూస్తుంటాం.*
*అలాగే ఓ సద్విమర్శ  సన్మార్గంలో నడిపించి, సంకల్పాన్ని సాధించే వాహికగా భావించాలి.* *కువిమర్శ గాలికి కొట్టుకు పోయే పనికిరాని తాలు, పొట్టు లాంటిది. దాని గురించి దిగులు ఎందుకు.*
*సుప్రభాత కిరణాల నమస్సులతో 


కామెంట్‌లు