క్షమించడమే-సద్గుణం.;-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్.
 సమర్ధ రామదాసు  ఛత్రపతి  శివాజీ మహారాజ్ గురువు. ఆయన  తన  శిష్యులతో కలసి శివాజీని చూడటానికి  వెళుతూ,ఎండవేడికి  తాళలేక  ఒక పెద్ద వేపచెట్టు నీడన విశ్రమించాడు.అక్కడికి  చేరువలో  చెరుకు  తోట ఉంది. కాని  దాని  యజమాని  అక్కడ  లేడు,ఆకలిగా  ఉన్న శిష్యులు  చెరుకు తోటలో  ప్రవేసించి  తలా ఒక  చెరుకు గడ తుంచుకుని తింటూ, నిద్రిస్తున్న గురువు పక్కన ఒ చెరుకు గడ ఉంచారు. అక్కడకు వచ్చిన చెరకు తోట యజమాని ఆసంఘటన చూసి కోపంతో ఊగిపోతూ,గురువు గారి పక్కన ఉన్న చెరుగడ చేతపట్టి గురువు గారికి వాతలు తేలేలా కొట్టాడు.మౌనంగా భరించాడు  గురువు గారు.
సాయంత్రం శివాజీ రాజ్యసభలో ప్రవేసించిన  సమర్ధరామదాసును  చూసిన  శివాజీ సాదరంగా ఆహ్వనించి తన సింహాసనం పై కూర్చోపెట్టి  ఉపచారాలు  చేసి.తన రాజ్యం యావత్తుధారపోస్తూ ఒక రాగిరేకు పై రాసి గురువు పాదాలకు అర్పించాడు."స్వామి ఈరాజ్యం,అంతా తమదే  స్వికరించండి" అన్నాడు.
"సంతోషం రాజా నీగురుభక్తి  మెచ్చదగినదే! కాని పరిపాలనా బాధ్యతకు నీవే సమర్ధుడవు" అన్నాడు. గురువుకు పాదాభివందనం చేస్తు, అతని  కాలిపై  ఉన్న గాయాలు  గమనించి, శిష్యులను  విచారించి చెరకు తోట  విషయం తెలుసుకున్నాడు శివాజీ.
మరుదినం  చెరుకుతోట  యజమానిని  బంధించి రాజసభలో ప్రవేశ పెట్టి "గురుదేవా  మిమ్ము ఇంతగా శ్రమపెట్టి  అవమాన పరిచిన ఈవ్యెక్తికి మీరే తగిన శిక్ష విధించండి"అన్నాడు శివాజీ.
అప్పుడు సమర్ధ రామాదాసు "రాజా  ఆ చెరుకు తోట  యజమాని  ఏటా మనకు కట్టే శిస్తు రద్దు  చేయడమే అతనికి విధించ వలసిన శిక్ష"అన్నాడు. తన గురువు క్షమా నిరతికి దయా గుణా నికి శిరస్సు వంచి నమస్కరించాడు శివాజీ.



కామెంట్‌లు