ఓజోన్ పొర.;-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
 తన ఇంటి ముందు అరుగుపైన చేరిన పిల్లలు అందరికి మిఠాయిలు పంచిన బామ్మ 'పాల్లలు ఈరోజు మీకు సైన్స్ సంభంధిత విషయమైన ఓజోన్ పొర గురించి క్లుప్తంగా చెపుతాను. ఆకాశం పైన ఓజోన్ పొర  కవచం భూమి యొక్క స్ట్రాటో ఆవరణలోని ఒక ప్రాంతం, ఇది సూర్యుని యొక్క అతినీలలోహిత వికిరణాన్ని గ్రహిస్తుంది. స్ట్రాటో ఆవరణలోని ఇతర వాయువులకు సంబంధించి ఇది ఇప్పటికీ చిన్నది అయినప్పటికీ, వాతావరణంలోని ఇతర భాగాలకు సంబంధించి ఓజోన్ (O3) అధిక సాంద్రతను కలిగి ఉంటుంది. ఓజోన్ పొరలో ఓజోన్ మిలియన్‌కు 10 భాగాల కన్నా తక్కువ ఉంటుంది, మొత్తం భూమి యొక్క వాతావరణంలో ఓజోన్ గా సాంద్రత సగటున మిలియన్‌కు 0.3 భాగాలు. ఓజోన్ పొర ప్రధానంగా స్ట్రాటో ఆవరణ యొక్క దిగువ భాగంలో, భూమికి సుమారు 15 నుండి 35 కిలోమీటర్ల (9.3 నుండి 21.7 మైళ్ళు) వరకు కనిపిస్తుంది, అయినప్పటికీ దాని మందం కాలానుగుణంగా భౌగోళికంగా మారుతుది 
వాతావరణ శాస్త్ర అధ్యయనం ప్రకారం భూ వాతావరణాన్ని ఐదు ప్రధాన పొరలుగా విభజిస్తారు. నేల నుంచి సుమారు 20 కి.మీ. వరకు విస్తరించిన పొరను 'ట్రోపోస్ఫియర్‌' అంటాము. ట్రోపోస్ఫియర్‌ పైభాగాన సుమారు 30 కి.మీ. మందాన అంటే నేల నుంచి సుమారు 50 కి.మీ. ఎత్తు వరకు ఉన్న పొరను 'స్ట్రాటోస్ఫియర్‌' అంటారు. ఇదే ఓజోన్ పొర ఉండేదీ, సుమారు ఓజోన్‌ పొర మందం సూమారు 20 కి.మీ అన్నమాట ఆ తర్వాత 35 కి.మీ. మందాన అంటే భూమి నుంచి సుమారు 85 కి.మీ. వరకు విస్తరించి ఉన్న వాతావరణ పొరను 'మీసోస్ఫియర్‌' అంటారు. మీసోస్ఫియర్‌కు పైభాగాన సుమారు 600 కి.మీ. మందాన అంటే నేల నుంచి సుమారు 700 కి.మీ. వరకూ విస్తరించి ఉన్న పొరను 'థóర్మోస్ఫియర్‌' అంటాము. ఆ పైభాగాన దాదాపు 10 వేల కి.మీ. వరకూ విస్తరించిన వాతావరణ భాగాన్ని 'ఎక్సోస్ఫియర్‌' అంటాము. ఇక ఆ పైభాగాన ఉన్నదంతా 'అంతరీక్షం'  ఓజోన్‌ పొర పలచనవడంవలన. ఇక అతి నీలలోహిత కాంతి సరాసరి భూమిని చేరడం వల్ల విపత్తులు సంభవిస్తాయి. అతి నీలలోహిత కాంతి వల్ల పంటలు దెబ్బతింటాయి.మనుషులకు చర్మవ్యాధులు,క్యాన్స్ ర్ వంటి పలు వ్యాధులు వస్తాయి. వాతావరణ కాలుష్యం ఎంతో ప్రమాదకరమైనది. ప్లాస్టిక్ వాడకం తగ్గించి,విరివిగా చెట్లు పెంచాలి అప్పుడే మానవాళికి క్షేమం లేకుంటే అంతా క్షామం 'అన్నది బామ్మ.
బుద్దిగా తలలు ఊపారు పిల్లలంతా!

కామెంట్‌లు