.పల్లె జీవనం;-యం.టి.స్వర్ణలత- కలం స్నేహం
పనిలోనే ఆనందం...
వెతుకుతుంది పల్లెజనం
ఇల్లు ఇరుకేమో గానీ....
వారి మనసెంతో విశాలం
చెట్టునీడే వారికి  నీడనిచ్చేపందిరి
సమయం సద్వినియోగంతో...
సాగుతుంది జీవనం

అల్లికలో జిగిబిగిలో వారికుంది..
అందమైన నైపుణ్యం
ఆలుమగలు కలిసి పనిచేస్తేనే...  
కలుగుతుంది ఆనందం
పత్తివడికి రాట్నంతో...
కండెలుగా చుడుతుంది దారం
బట్టలపై చేతి కుట్టుపనికి...
అదే అవుతుంది ఆధారం

కుక్క కోడి గొడ్డు గోద... 
జీవజాతులతోనే సహజీవనం
పశుసంపద పల్లెలలకు.. 
చూపుతుంది జీవనాధారం
చేదబావి నీరక్కడ  స్వచ్ఛమైన జలం
తోడుతున్న పడతుల శరీరానికి ..
అవుతుంది వ్యాయామం
ఆంటిల్లిపాది పంచుకుంటే పనులు... 
అవుతుంది ఆ ఇల్లే స్వర్గధామం

కామెంట్‌లు
అల్లాడి వేణుగోపాల్ చెప్పారు…
పల్లె జీవనం
పరమ పావనం

అల్లాడి వేణుగోపాల్