కార్తీక పున్నమి వేళలో
సుందర వన విహారాలలో
సందడి చేసే పుపొదరిళ్లలో
ఊగిసలాడే నా మది మల్లె మొగ్గల వలె....
శరత్ కాలపు నిండు వెన్నెలలో
సన్నజాజి సుగంధపు గాలిలో
కల్మషమెరుగని ప్రియుని సన్నిధిలో
గగనానికెగిసే నా మది కపోతము వలె....
వైశాఖపు వెన్నెల మాధుర్యపు వడిలో
రాలిన పారిజాతాల పూరెమ్మల సన్నిధిలో
పుడమికి పుష్పాభిషేకం చేయు సమయంలో
నీ చెంత చేరుటకై పరుగులిడె నా మది
సాగరాన్ని చేరే నదీ కన్యక వలె....
ఆషాడ పున్నమి వేళలో
నీరాకకై చూసి చూసి చూపు మసకబారి
విరహపు వేడి తాళలేక, వెన్నెలమ్మ
శీతలోపచారాలకైన తేరుకొక
అల్లకల్లోలమాయే నా మది
సునామి వేళ సాగర గర్భము వలె....
మాఘ పున్నమి వేళ మధ్య రాతిరిలో
మనువాడ వచ్చిన మావను చూసి
తబ్బుబ్భై, తాళ లేని తాపాన్ని చల్లార్చి
పురి విప్పిన మయూరం వలె ఆడే
నా మనువు, తనువు ఏకమై....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి