వివక్ష ఫలితం (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
 
     రామనాథం పెద్ద జమీందారు. అతని మొదటి భార్య చనిపోవడంతో చుట్టాల పోరు పడలేక మంగమ్మ అనే అమెను రెండో పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య కుమారుడు సతీశ్వర్. రెండో భార్య కుమారుడు శ్రీనాథ. అయితే మంగమ్మ పిల్లల పెంపకంలో వివక్ష చూపేది. సతీశ్వరును ఒకరోజు ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళగొట్టగా సుశీల అనే ఆవిడ సతీశ్వరును చేరదీసి కన్నతల్లిలా పెంచింది. సుశీల కుమారుడు జగదీశు, సతీశ్వర్ ఇద్దరూ ఒకే తరగతి చదివేవారు. సతీశ్వర్ చాలా తెలివైన విద్యార్థి కాగా జగదీశు సగటు విద్యార్థి. సతీశ్వరుకు జగదీశు ప్రాణ స్నేహితుడు అయ్యాడు. సతీశ్వర్ జగదీశుకు తెలియని విషయాలు చెబుతూ, తనతో పాటు చదివిస్తూ కొద్ది రోజుల్లోనే తెలివైన విద్యార్థిగా తీర్చి దిద్దాడు. కాలక్రమంలో ఇద్దరూ ఉన్నత విద్య పూర్తి చేసి పోటానుపోటీగా గొప్ప ఉద్యోగాలు సాధించారు. 
       మంగమ్మ తన కుమారుడు శ్రీనాథను అతి గారాబంగా పెంచింది. ఆ గారాబం వల్ల చదువు సరిగా అబ్బలేదు. ఆడింది ఆట పాడింది పాట కదా! ఎప్పుడూ అల్లరి బృందంతో తిరుగుతూ ఆట పాటలతో కాలక్షేపం చేస్తూ చెడు అలవాట్లను నేర్చుకున్నాడు. తల్లిని మాటిమాటికీ బాగా డబ్బులు అడగటం స్నేహితులతో కలిసి చెడు వ్యసనాలకు ఖర్చు చేయడం పరిపాటి అయింది. చదువు ఆగిపోయి, ఉద్యోగం లేకపోయేసరికి, విచ్చలవిడి ఖర్చులతో ఆస్తి అంతా హారతి కర్పూరంలా కరిగిపోతుంది. పైగా బయటికి జనంతో తగాదా పెట్టుకొని, గొడవలను ఇంటి మీదకి తీసుకువస్తున్నాడు. ఇది ఇలా ఉండగా మంగమ్మ ప్రేరణతో తనకు ఆస్తి అంతా రాసివ్వమని శ్రీనాథ తండ్రి మీద తిరగబడ్డాడు. ఆలస్యంగా మేల్కొన్న జమీందారు రామనాథం మంగమ్మను, శ్రీనాథను ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళగొట్టాడు ‌‌ సతీశ్వర్ జాడ కోసం వెతకడం మొదలుపెట్టాడు. 

కామెంట్‌లు