ఉత్పల మాల ;-ఎం. వి. ఉమాదేవి
కన్నుల పండుగయ్యె నిట కానల సుందర సీమలే గనన్ 
వెన్నెల పోగులౌర సెలవేటికి తెల్లని రెల్లుపూలిలన్ 
మన్నన నాదుకోరికను మాపటి వేళకు  తీర్చరాదొకో 
గున్నది లేడితెమ్ముమిక గుమ్ముగ బంగరు ఛాయనున్నదే!

పతికి జూపించి కోరెను పడతి సీత 
పంచ వటిలోన యందాల పరిసరమ్ము 
మెచ్చి తానదె యాడగ మిగులకోర్కె 
మాయ లేడిని రావణ మాయలోన!


కామెంట్‌లు