పద్యాలు ; మమత ఐలకరీంనగర్9247593432
 దత్తపది:- నూరు..వేయి..లక్ష..కోటి
ఆ.వె
నూరుకూడ బెట్టి నూకలన్నంబేల
వేయి మాటలందు వింతలేను
లక్షలున్న నేమి బిక్షమెత్తి కుడువ
కోటికధిపతైన  కొదవెయౌను
తే.గీ
నూరబద్ధములౌ ; దాచ నొక్క నిజము
వేయి కళ్ళను కప్పిన మాయ మాయె
లక్షణంబైన గుణమేను లౌక్యమంటె
కోటి రత్నాలు బోసిన కొనగ తరమె
 దత్తపది:-నూరు..వేయి..లక్ష..కోటి
తే.గీ
నూరు శుభకార్యముల్ జెర్చి నొప్ప లేక
వేయి బాధలు బెట్టినా వెంటరారె
లక్షలాత్మాభి మానంబు రక్షకాగ
కోటి దేవతా శీస్సులే కూర్మినొసగు

కామెంట్‌లు