: కార్తీక పౌర్ణమి;-చంద్రకళ. దీకొండ,మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.చరవాణి : 9381361384
కార్తీక మాసాన- శుక్లపక్ష జాబిల్లి
ఆహ్లాదమొలికిస్తూ- ఆకసమున వెలిసె

కనువిందు చేసేను- షోడశ కళలతోడ
పండువెన్నెల పంచె-నిండు చంద్రోదయం

ఉసిరి తులసి సిరులను- పూజించ భక్తితో
జీవితాన వెతలను- తొలగించే పౌర్ణిమ

దీపారాధనతో- ఇంటింటా వెలుగులు
సంతోషకాంతులే-వదనాల శారదా...!
****************************************


కామెంట్‌లు