*సమస్యాపూరణం*;-బెజుగాం శ్రీజ గుర్రాలగొంది జిల్లా:సిద్ధిపేట .చరవాణి:9391097371

 *భర్తమరణించభార్యసౌభాగ్యమందె*
*1.తేటగీతి*
భార్యమాటనువినకను భారముగను
చెడలవాట్లకుబానిసై చింతలేక
నిత్యమున్దిప్పలనుబెట్టి నీతిదప్పె
భర్తమరణించభార్యసౌభాగ్యమందె
*2.తేటగీతి*
భార్యనొదిలిపరస్త్రీల వాంఛదీర్చ
పిల్లపాపలనొదిలియు విఱ్ఱవీగి
స్వార్థమునుచూసుకొనునట్టి జగతిలోన
భర్తమరణించభార్యసౌభాగ్యమందె

కామెంట్‌లు