సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414. peddissrgnt@gmail.com

మాట-
 ❖మంచి ఆలికో మాట, మంచి ఎద్దు కొక వాత. ❖ మంచి గొడ్డుకో దెబ్బ,  మంచి మనిషికో మాట.
❖మంచిమాట శత్రువు చెప్పినా వినాలి, చెడ్డమాట మిత్రుడు చెప్పిన వినరాదు.బెంజమిన్ ఫ్రాంక్లిన్
❖మాట్లాడే ప్రతి మాట ప్రేమతో నిండి ఉండాలి. మధర్ థెరిసా
❖మనిషి  దగ్గరున్న శక్తివంత ఔషధం మాట. కిప్లింగ్❖ మనిషి చస్తే మాట మిగులుతుంది.
❖మనిషికి ఒక మాట ,  గొడ్డుకు ఒక దెబ్బ. ❖ మాట గొప్ప చెప్ప మాటలు చాలవు.
❖మాట చుట్టమా? పెట్టు చుట్టమా? ❖ మాట తీరు పాండిత్యాన్ని తెలుపుతుంది. ..శివపురాణం.
కామెంట్‌లు