పిల్లలం -మల్లెలం( కవిత);-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
పిల్లలం పిల్లలం పిల్లలం
మేంఅల్లరి చేయని పిల్లలం
మల్లెలం మల్లెలం మల్లెలం
మీ ఉల్లము దోచిన మల్లెలం !

పిల్లలం పిల్లలం పిల్లలం
కల్లాకపటం లేని పిల్లలం
మల్లెలం మల్లెలం మల్లెలం
అల్లిబిల్లి అయిన మల్లెలం !

పిల్లలం పిల్లలం పిల్లలం
గిల్లి కజ్జాలు లేని పిల్లలం
మల్లెలం మల్లెలం మల్లెలం
మచ్చలేని మంచి మల్లెలం !

పిల్లలం పిల్లలం పిల్లలం
పిల్లి మొగ్గలేయు పిల్లలం
మల్లెలం మల్లెలం మల్లెలం
మేం ఎల్లలెరుగని మల్లెలం !

పిల్లలం పిల్లలం పిల్లలం పిల్లలం
వీసమంత మోసమెరుగని పిల్లలం
మల్లెలం మల్లెలం మల్లెలం మల్లెలం
గొల్లపల్లి వారి ముల్లెలైన మల్లెలం. !

పిల్లలం పిల్లలం పిల్లలం పిల్లలం
పిసరంత పిరికితనం లేని పిల్లలం
మల్లెలం మల్లెలం మల్లెలం మల్లెలం
అల్లం బెల్లం ఉల్లమైఉన్న మల్లెలం !

పిల్లలం పిల్లలం పిల్లలం పిల్లలం
నిలువ నీడలేక అల్లాడే పిల్లలం
మల్లెలం మల్లెలం మల్లెలం మల్లెలం
 అల్లన మెల్లన అలసిన మల్లెలం.  !

పిల్లలం పిల్లలం పిల్లలం పిల్లలం
పల్లె తల్లి ఒడిలోని చిన్న పిల్లలం
మల్లెలం మల్లెలం మల్లెలం మల్లెలం
తెల్లనివెన్నెల వెలుగులీను మల్లెలం


కామెంట్‌లు