ప్రభోదము(కవిత);-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
హిందువులారా మాదీన బంధువులారా
మా యోగక్షేమాలను ఆశించి పోషించే
ఓ మా ఆత్మ బంధువులారా ఆపద్బాంధవులారా
మన దేశం సరిహద్దులో స్థితిగతులను తెలుసుకో లేరా !

హిందువులారా మాదీన బంధువులారా
మా అంతరంగ క్షేత్రమందు అలలై కలలై
ప్రవహించే ఓ మా ప్రియ సింధువులారా
రండి రండి రండి దేశం సరిహద్దుల్లో మీరు నిలవండి!

మా కన్నులందు కొలువైన మీరంతా
మాకు ఇలలో నెలువై నిల్చారు మాచెంత
మా కంటి ఇంటి నుండి కురిసేటి మెరిసేటి
మా ఆనంద భాష్పాల బింధువులారా !

ఐకమత్యమే మనకు బలమని
అవసరాలు తీర్చే టి ధన మని
తెలుసుకొని నడవాలి ముందుకు
మన సమర సన్నాహాల విందుకు!

కరోనా కాలమని కాటువేయు గాలమని
అడ్డకాలు వేసి మీరు గీత దాటి పోవద్దు
గడ్డుకాలం రాకముందే చేరుకుంటే ముద్దు
మాస్క్ వేసుకొనుటకు ఏమాత్రం మరవద్దు!

మన దేశం సరిహద్దులో గడబిడ చేస్తూ
హల్ చల్ చేస్తూ దాడికి దిగింది చైనా
మన ప్రధాని సందేశం అందుకుని దాన్ని
ఎదుర్కోవాలి మనమంతా ఎలాగైనా!

చైనా దేశం మళ్లీ తిరిగి చూడకుండా 
సరిహద్దులో తిరిగి తాను కాలు పెట్టకుండా
గుండె ధైర్యంతో దానికి గుణపాఠం చెప్పుదాం
దాని అసలు గుట్టును అందరి ముందు విప్పుదాం!


కామెంట్‌లు