ఓం నమః శివాయై నమః శివాయ!"శి"కారమే శివము!"శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098
 👌"శి"కారము మంగళము!
      "అగ్ని" రూపము! శివము!
      తెలుసుకొను మీ నిజము!
               శంకర ప్రియులార!!
      ( శంకర ప్రియ పదాలు., )
👌శ్రీ శివ పంచాక్షరి యే "తారక మహా మంత్రము"!   "నమః శివాయ".. అయిదు వర్ణములుగల "స్థూల పంచాక్షరి"! ఇందు లో.."శి"కారము మూడవ వర్ణము!
🙏"శి"వా మనోహరాయ!
     అభిషేక ప్రియాయ!
     రుద్ర స్వరూపాయ!
             నమో నమః శివాయ!
 ( "శి"కార శివుని ప్రార్ధన)
👌"శి"కారము.. పంచ మహా భూతము లలో.. మూడవ దైన "అగ్ని" రూపమును పేర్కొను చున్నది! పంచ కృత్య దివ్య మూర్తు లలో.. "రుద్ర" దేవుని సూచించు చున్నది!
👌భవ తారక మంత్ర మైన "ఓం నమః శివాయ".. ప్రణవ సహిత, శ్రీ శివ పంచాక్షరియే పావన మంత్రము! దీనిని అనుదినము, నియమ నిష్ఠలతో.. జపించండి!శ్రీ ఉమా మహేశ్వరుని దివ్యానుగ్రహము పొందండి!
          🔱ప్రార్ధనా పద్య రత్నము
          ( కంద పద్యము)
         శిరమున దోషాకరునే,
          మరి భూషగ దాల్చి నావు, మన్నన తోడన్;
          కరుణా వరుణాలయ! నీ
           కరుణను నాయెడను కూడ, కనబరచు శివా!
       
       (.. శ్రీ శివ శతకము, డా. శ్రీపాదుక., )
         ( సాంబ శివుడు.. భక్త వశంకరుడు! మిక్కిలి దోషాకరు డైన, భాగవతోత్తము డైన.. చంద్రుని...  శిరస్సు నందు భూషణముగ దాల్చినాడు! కనుక, శివునకు "చంద్ర శేఖరు" డని పేరు వచ్చింది. )
          ఓం నమః శివాయ! 
ఓం నమో భగవతే రుద్రాయ!

కామెంట్‌లు