చైల్డ్ లైన్ సే దోస్తీ వారోత్సవాలు;-మొలక ప్రతినిధి వికారాబాద్
 తాండూర్ ఐ సి డి ఎస్ కార్యాలయం నందు వివిధ సమస్యలతో ఉన్న బాలల సమస్యలు పరిష్కరించుట కు డివిజన్ స్థాయి అధికారులతో ముఖా ముఖి (open house) సమావేశం  
. కరోనా బారిన పడి తండ్రి గాని తల్లి గాని లేదా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన పిల్లలతో తాండూర్ డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ గారు, జిల్లా లీగల్ అధికారి నరేష్ కుమార్ గారు తాండూరు ఐ సి డి ఎస్ సూపర్వైజర్స్ నిర్మల, యాదమ్మ మరియు దశమ్మ గార్లు పిల్లల సమస్యలపై చర్చించి పై జిల్లా అధికారులకు తెలియజేస్తాం అని చెప్పడం జరిగింది. బాధిత బాలలు పై చదువుల కొరకు ఆర్థిక సహాయం అందించాలని, గురుకుల పాఠశాలలో చదువుకొనుటకు అవకాశం కల్పించాలని, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల భూ సమస్యల పరిష్కారం కొరకు అధికారులను అడగడం జరిగింది. బాలలు అడిగిన సమస్యల పరిష్కారం కొరకు అధికారులు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ తాండూర్ కోఆర్డినేటర్ వై వెంకటేష్ ,సిబ్బంది ,పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు మరియు తదితరులు పాల్గొన్నారు.కామెంట్‌లు