---- 8 ------
.......స్టూడియో నుండి నాకబ్బితే.... నాచుట్టూ ఉన్న వాతావరణ ప్రభావానికి కూడా
నేను అతీతుడను కాలేక పోయాను........ !
నా సీనియర్ గురువులు...
ఫోటోలు తీయించుకున్నవాళ్ళు
తీసుకెళ్ళటానికొచ్చి... బాబూ ఈ ఫోటోలకు ఫ్రేములు ఎక్కడ కడతారు అని అడిగితే... మీరు పనిచూసుకుని రండి... మేం కట్టించి ఉంచుతామని చెప్పి...
దగ్గరలోనే... తాతయ్యలు గారని ఫ్రేమింగ్ షాప్ ఉండేది..!
వాళ్ళు ఒక ఫ్రేమ్ కి 75 పైసలు పుచ్చుకుంటే... వీళ్ళదగ్గర యితడు రెండు రూపాయలు పుచ్చుకునే వాడు... సాహచర్యం ప్రభావం... నాకూ అబ్బింది !!
రోజుకి ఆరో, ఎనిమిదో ... ఫ్రేమ్ లు కట్టించేవాడ్ని !స్టూడియోలో మాగురువులు ఇచ్చేదానికి ఈ ఫ్రేమ్ ల వల్ల మూడురెట్లు ఎక్కువ వచ్చేది.... ! అదిచూసి
మా పెద్దగురువు పనిలో ఏ చిన్న పొర పాటు జరిగినా... నీ ధ్యాసంతా అటేఉంటే ఇక్కడి పనులిలాగే ఉంటాయ్ అంటూ చాలా చిరాకుతో తిట్టుకునే వారు... ! ఆ ఫ్రేమ్ షాపు తాతయ్యలు అతని కొడుకు గోపాల్ కూడా....కష్టపడుతున్న వాళ్ళం, మాకంత రావటం లేదు... తేరగా మీకు అంత వస్తోందంటూ ఏడ్చే వాళ్ళు... !
నిజమే కదా... బోలెడు పెట్టుబడులు పెట్టి... శ్రమపడితే వాళ్ళకొచ్చేదాని కంటే మాలాంటి వాళ్లకు అంతంత వస్తే... ఎవరి మనసు మాత్రం బాధపడదు... !!
మాగురువులిచ్చేది...అవి
అరవైపైసల రోజులైనా... రెండు రూపాయల రోజు లైనా... ఐదు రూపాయలైనా ఆఖరికి ఇరవై ఐదురూపాయలిస్తున్నప్పుడైనా
ఎంతిస్తే అంతఅలాఇంటికిచ్చేసే
వాడిని, బయట నాకొచ్చే ఈ డబ్బుల్ని... చాలావరకూ నేనే ఖర్చు పెట్టుకునే వాడ్ని !
మాస్టూడియోకి ఎదురుగా కొత్త గుండు సత్యం గారని కిరాణా షాప్ ఇల్లు కలిసే ఉండేది!వాళ్ళ ఇద్దరబ్బాయిలు
ప్రసాద్,కృష్ణ ఫ్రెండ్స్అయ్యారు!
వాళ్ళ అమ్మ, నాన్న సంక్రాంతికి
బొబ్బిలి వెళ్లిపోయేవారు !
రాత్రయితే... వాళ్ళు, నేను, మరో ఇద్దరు కలిసి పేకాట కంపీ
ఆడుతూ... సిగరెట్లు కాల్చుతూ
ఎంజాయ్ చేసేవాళ్ళం... మాస్టూడియో ఎదురుగానే...
మహంతి వీధి అని ఉంది...
సంక్రాంతికి నెలగంట పెట్టింది మొదలు వేళా పాలా అనకుండా... పేకాట్లే పేకాట్లు !
మాఇంటికెళ్లే తోవ అదే... అక్కడిఆట కాసేపు నన్ను కట్టి
పడేసేది !
ఓ రోజు ఒకతను ఆటలో బాగా డబ్బులు గెలుచుకుని... నాకో పావలా అంటే ఇరవైఐదు పైసలు ఇచ్చాడు ఆ పావలాతో
అక్కడ కోత అంటే మంగా పతి
ఆడితే...ఇరవైఐదురూపాయలు గెలిచాను !అక్కడినుండి తరచూ పేకాట అలవాటై పో యింది (పండగరోజుల్లోనే )
బాబాజార్దా... నములుతూ చార్మినార్ సిగరెట్ కాల్చటం కూడా దినచర్యగా మారిపో ఇంది.... !!ఇదంతా ఎందుకంటే
చుట్టూవున్న వాతావరణం...
పరిస్థితులు ఎలాంటి ప్రభావం చూపుతాయో... అనుభవాలు తెలియజెయ్యటానికే.... !!
****************
..... సశేషం.....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి