మనిషికి మనిషి తోడౌతూ..,
మలయమారుత వీవెనలు వీయించాలి..!
వావి,వరుసలు మృగ్యమౌతూ..,
ధనపిపాసా రాక్షసి రాజ్యమేలుతున్న ఈ కలికాలపు ఆకలి కాలంలో..,
బాబాయ్ అని పిలిచి ఆప్యాయతను కురిపించినా..,
ప్రతిఫలాన్ని ఆశిస్తారనుకుని దూరంచేసుకోవాలని ఈసడింపుల దండకం పాడినా..,
చూఱు పట్టుకొని వేలాడుతూ
చీదరింపుల అష్టోత్తరాలను తుడుచుకొని..,
సాయమవ్వాల్సిన వేళలో
"దైవం మానుష రూపేణ"
అన్న చందాన చేయూత నందించిన గుణం..!
తనకై దాచుకున్న పైకాన్ని ప్రాణదానానికై ఖర్చు చేసి మానవత్వ పరిమళాలు అందించిన మంచి మనసున్న ప్రతీవాడూ మహామనీషై చరిత్ర తిరగరాసే మహానుభావుడై నిలిచుంటాడు ప్రజలహృదయ సింహాసనాన వెలుగులీనే చక్రవర్తై..!!!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి