పల్లెలోని తియ్యదనం;-భారతి. పెద్దపల్లి;-కలం స్నేహం
పట్నం  బ్రతుకులు పరమ
చికాకుతోనే మొదలౌతుంది 
తొందరగానే బారమౌతుంది
అక్కడ ఎవడి గోల వాడిదే
పట్టించుకునే నాథుడే కరువయ్యాడు
  తెల్లవారితే బిజీ బిజీ  పరుగులాయే
రోడ్లన్ని గజి బిజి గందరగోలం  
ఇల్లు ఇరకటం అద్దె దొరకటం కష్టం

మధ్య తరగతి  మానవునికి సాధ్యమా
ఆకాశానికి అంటిన ధరలు   
కాలుష్యానికి అడ్డుకట్ట లేదు 
వచ్చే రోగాలను సైతం ఎవరు ఆపలేరు
దవాఖాన బిల్లు చూస్తే జల్లుమనే 

కడుపు నింపే అమ్మ కనిపించదే
బాధ్యత నేర్పే నాన్న ముందుకు 
నడిపించడే నడి సముద్రంలో
నావలా పట్నం బ్రతుకులు.

ప్రకృతి ఒడిలో ఉన్న పల్లెలు 
పలకరించే మనుషులు 
ప్రేమకు ప్రతి రూపాలు
 అమ్మ నాన్నల  ఆప్యాయతలు
 మరుదండ్ల నును సిగ్గు
వచ్చావా నాయన అంటూ
పక్కింటి పలకరింపులు
యాంటి బయాటిక్స్ ఇచ్చే వేప మాను
 
పచ్చని పంట పొలాలు
స్వచ్ఛమైన  చల్లని గాలులు
చెట్లు చేమలు మందులు లేని
తాజా కూరగాయలు పండ్లు
గుడిలో సుప్రబాతం  గుడి లోని
గంటలు ఊరిలో సందళ్ళు
ఇవ్వన్నీ చూస్తే ఎవరు వెళ్ళగలరు  
పట్నం బ్రతుకులురద్దు పల్లెలే ముద్దు


కామెంట్‌లు
Unknown చెప్పారు…
Super madam