*దీపావళి శోభ*;-*మిట్టపల్లి పరశురాములు*
కటికచీకట్లుతొలగించి-కనులముందు
దీపకాంతులతోడను-దివ్యముగను
వచ్చినిలిపెనుదివ్వెలు-వసుధయందు
వెలుగు లెన్నియొనింపెను-వేగిరమున

సత్యభామయెహరితోడ-సత్వరముగ
బయలదేరెనునరకుని-బట్టిచంప
నరహరియుతానురథమును-నడుపుచుండ
ఎక్కుపెట్టెనుశరమును-నిక్కముగను

దీప కాంతుల వెలుగులు-దివ్యముగను
ముంగిటనిలిపిరిజనులు-ముదముగాను
కొత్తవలువలుధరియించి-కోర్కెమీర
వెలుగుబిడ్డలైదినమంత-వెలుగుచుండ


కామెంట్‌లు