అభిసారిక;-స్వర్ణలత-కలం స్నేహం
ఎవరో వచ్చే వేళాయే
ఎందుకొ త్వరగా రారాయే
మనసు మనసులో లేదాయే
ఎదలో తెలియని కలవరమాయే

మనసున కొలువైన మనోహరుడు
కనుల మాటున దాగి కవ్విస్తుంటే
కనులారా గాంచాలని తపిస్తూ...
ఊహల ఊసులన్ని నేస్తంతో పంచుకుంటూ...
చెక్కిట చేయి చేర్చి కుతూహలం ముప్పిరిగొనగా...
వింటున్న తన నెచ్చెలికి  వివరిస్తూ...
కోటి ఆశల కొత్త కాంతులు కళ్ళలో నింపుకుని...
వాకిట చేరి వేచిన అభిసారిక...

ఉదయపు వెలుగులతో...
హృదయనాథుడు ఇల్లు చేరాలని
తన జీవితాన కాంతులు వెల్లి విరియాలనీ....
ఎదురు చూపులో వేచిన కాంత


కామెంట్‌లు