బంగారు పూలు - బాల గేయం --ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
బంగారు పూలచెట్టు 
నేలoతా పరిచినట్టు 
తోటలోను కనికట్టు 
విడిచిపోయేదెట్టు? !

ఆకులేని అరణ్యాలు 
చలికాలపు సోయగాలు  
పూలవాన జోరు వాలు 
మోహనమే అందాలు !!

పసిడి వన్నె పూల తోట 
మిసిమి రంగులోని బాట 
పూరేకుల సయ్యాట
ఇంటికిరాను ఇక్కడే ఉంటా!!


కామెంట్‌లు