:*జగమంత కుటుంబం*-ఇందిరా తుంగ-కలం స్నేహం
మనసులు కలవాలన్న
మమతలు విరియాలన్న
అనుబంధాలు పెనవేసుకు కోవాలన్న
రక్త సంబంధాలే కానక్కర్లేదు
మంచి మనసుంటే చాలు....
నా అనుకుంటే చాలు
అందరూ మనవారే.

విధి ఆడించే వింత నాటకంలో
ఎన్నో పాత్రలు మనకు చేరువవుతాయి,
కొన్ని దూరమవుతాయి..
కొన్ని మనసును గాయం చేస్తే
మరికొన్ని ఆ గాయాలకు లేపనాన్ని పూస్తాయి..
ఇంకొన్ని సుగంధ పరిమళాలను ఇస్తాయి.
జీవితానికి బాసట గా నిలుస్తాయి.

ఆనందంలో మాత్రమే  పాలుపంచుకునే వాళ్ళు కొందరయితే,
ఆపదలో అడ్డుకునే వారు  కొందరు...
అహంతో దూరం జరిగే వారు
 ఇంకొందరు..
మానవత్వం మచ్చుకైనా లేని వారు మరికొందరు..

ఏమైనా.. మానవజన్మ
మనకు దొరికినందుకు
మానవత్వం ఉన్న మనుషుల్లా
మంచి చెడ్డ యోచించి
కష్టoలో చేయి అందించి
గుండె భారాన్ని తగ్గించి
మనసున్న మారాజులా
ఇలలో నిలిచి పోదాం. 
         


కామెంట్‌లు