ఇంద్ర ధనుస్సు ;-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
వర్షంతో సూర్యకాంతి కలిసే 
ఇంద్ర ధనుస్సు అందాలు 
సప్తవర్ణాలతో కనువిందు 
ప్రకృతిరంగుల అమరిక పసందు!

ఇక్కడ వర్షం అల్లక్కడ ఎండా 
పంచభూతాల చిత్రాలెన్నో 
మానవ మేధ పరిధిని వెక్కిరిస్తూ... 
ఏడు రంగుల హరివిల్లుగా !

ఎవరూ సృష్టించలేరు.. 
మరెవరూ ఆపలేరు.. 
కేవలం అదృశ్య శక్తి, అదే  సైన్స్ 
సముద్రం, మేఘాల విధంగానే 
ఇంద్ర ధనుస్సు ఇంపైన రంగుల 
పరావర్తనం కాంతి తో !
అన్నీ కలిసే ధవళవర్ణం !!


కామెంట్‌లు