చెవిలో జోరీగ-నెల్లుట్ల లావణ్య-కలం స్నేహం
విన్న పాఠం గుర్తుండాలన్నా
ఏదైనా కంఠస్తం పట్టాలన్నా 
అనుకున్నవి జ్ఞప్తికి రావాలన్నా
విషయాలనుచెవిలో జోరీగగా వినియోగం 
ముఖ్యం
విద్యార్థులకు చక్కగా ఉపయోగపడే మంత్రం

విన్న విషయమే మరల మరల విని 
ఒక పనిని అదే పనిగా చెప్పించుకుని
జీవితంలో చేయవలసిన కార్యక్రమాలను 
విరామం లేక గుర్తు చేయించుకొని
విసిగి వేసారి ఆ కార్యము మీద అయిష్టత పెంచుకొని
ఆ పని మీద విరక్తి చెంది వ్యతిరేకంగా మారే సమయం 
ఎక్కువగా యువతలో చూస్తున్న విషయం

వయస్సు మీద పడుతున్న కొద్ది 
 చేతగానితనం చేరువైన కొలది
శరీరము సహకరించక జ్ఞాపకం లేని సమయంలో 
పనులు సమయానికి చేసుకోలేని పరిస్థితుల్లో
ఇతరుల మీద ఆధారపడే తరుణంలో  
ముఖ్యంగా వృద్ధులకు ఉపయోగపడును

సంసార సాగరంలో మునిగి 
బాధ్యతలు నెత్తిన వేసుకొని
పని ఒత్తిడి కారణంగా మరిచిపోయి 
చేయలేని గుర్తులేని కార్యాలకై వినియోగపడును


కామెంట్‌లు