మాపాప!;-- డాక్టర్.గౌరవరాజు సతీష్ కుమార్.

 మాపాప ఎక్కింది పూలతేరు
మాపాప మోసింది చెరువునీరు
మాపాప కోసింది కలువపూలు
మాపాప చూసింది పంటచేలు
కుటుంబమే సంస్కృతుల తల్లివేరు
అదేకదా జగతిని నింపుసౌరు
ఆనందాల సంస్కృతియే మబ్బుచాప
అనుసరిస్తు వుంటుంది మా మంచిపాప!!

కామెంట్‌లు