ఉక్కు మనిషి పటేల్ (ఆట వెలది );-ఎం. వి. ఉమాదేవి
చక్కనైన మనిషి చాలపట్టుదలను 
రక్త మందు గలిగి రమ్యమూర్తి 
దేశభక్తి చూడ తేటతెల్లముగాను 
వల్ల భాయి నిల్చె వాసి గాను!

తేట గీతి 

కేసు వాదించు సమయము కీడువార్త 
వినిన చలియించ బోనట్టి విమలధృఢత 
నీతి భావన వెలయించు నిర్మలమది 
ఉక్కు మనిషియె తానయ్యె  చక్కగాను! 


కామెంట్‌లు