దీపావళి. కవిత.;-తాటి కోల్ ఆ పద్మావతి. గుంటూరు.

 తారలన్ని నేలకు దిగి వచ్చినా
వెలుతురు లేని దీపాల వెలవెలబోతున్నాయి.
అధిక ధరలు చుక్కల తో పోటీపడి
క్రిందికి దిగి రానని మారాం చేస్తున్నాయి.
సంచిలో డబ్బులు జేబులో టపాకాయలు
మధ్యతరగతి మనిషికి
మసకేసి నా దీపావళి.
కరోనా కాలం తో పడగవిప్పిన దారిద్రం
చిచ్చుబుడ్లు పొగలా ఎగ జిమ్మ మసకబారిన దీపావళి.
భయం చీకట్లో కరోన కరాళ నృత్యం
నరకాసుర బకాసుర అందరిని
నిత్యం పుట్టుకొస్తున్న ది
సమాజాన్ని పట్టి పీడించే
మారణహోమాలు మానభంగాలు తో
వణికిపోతున్న ది దీపావళి.
పండుగపూట బంధుమిత్రులను ఆహ్వానించు తామంటే
పిండివంటలు చేయకుండానే చమురు ధర 
అగ్గిపుల్ల తీయకుండానే మండిపోతున్న ది.
స్వీట్లు చేద్దామన్నా షుగర్ పేషెంట్లు మంచిదే 
మంచికే నంటూ పంచదార ధర పసిడి తో చేతులు కలిపింది.
కూరగాయలకు రెక్కలొచ్చి
ఆకాశం నుంచి కిందికి దిగిను అంటున్నాయి.
చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి అన్నట్లు
పండుగ పూట పచ్చడి మెతుకులతో పేదవాడి బతుకు సరి.
సమాజం సమత మమతల వెల్లువలై
 వెలుగులు చిమ్మిన నాడు చీకటి భయాలను తొలగించి
దీపాలను వెలిగిస్తే
అదే నిజమైన దీపావళి
అదే అసలైన దీపావళి.
తిమిరంతో సమరం చేసి ఇ భయాన్ని పారద్రోలు దాం.
మానవతా జ్యోతులు ఇంటింటా వెలిగించి
మనమంతా కలసి దీపావళి జరుపుకుందాం.
ప్రతి హృదయంలో అరుణ అనే జ్యోతిని వెలిగించుదాం.
అమావాస్య చీకట్లను విడనాడి
దీపాల కాంతుల ను వెదజల్లి కాంతి పధం వైపు పయనిద్దాం ‌
కామెంట్‌లు