శాశ్వతం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం ఈ ప్రపంచంలో ఉన్నాలేకున్నా శాశ్వతంగా నిలిచేవి మన మంచి చెడ్డలు. అందుకే మంచి గా మాట్లాడటం నలుగురితో సఖ్యంగా ఉండటం అవసరం.ఒకప్పుడు ఆ చిన్న గుట్టపు ఓఅవ్వ తాత ఉండేవారు. చిన్నతోట  ఆవులు కూరలు పండిస్తూ సంతోషంగా ఉండేవారు.అమ్మా ఆకలి అని ఎవరైనా వస్తే  ఉన్న దాని లో కాస్త తీసి పెట్టేవారు.గుట్టకింద జనం మహాస్వార్ధపరులు.జాలిదయలేనివారు.తమపిల్లలను కూడా అలాగే పెంచారు.భయంకరమైన కుక్క ల్ని పెంచుతూ కొత్త వారిపై ఉసికొలిపేవారు.పిల్లలు కూడా వాటివెనక పరుగెత్తి కొత్త వారిపై  ముష్టి వారి పై రాళ్ళు విసిరి వారు లబోదిబో అంటుంటే విరగబడి నవ్వేవారు.ధనవంతులకి అడుగులకి మడుగు లొత్తేవారు.వారిపట్ల పిల్లలు అవిధేయత చూపితే చితక బాదేవారు.ఒక రోజు అవ్వా తాత తీరిక గా కూచున్న ప్పుడు పిల్లల అరుపులు కుక్కలు భొయ్మని పరుగులు పెట్టడం విన్నారు.ఇద్దరు కొత్త వారు తమవైపు రావటం గమనించి  తాత వారిని తమ ఇంట్లోకి ఆహ్వానించాడు.తాము వండుకున్నది వారికి పెట్టి   ఇంత రాగి జావ కాచింది అవ్వ  తమ ఇద్దరికీ! ఆవచ్చిన ఇద్దరిలో మధ్య వయస్కుడైన వాడు తన కర్రనునేలపై పెట్టాడు.అది దొర్లుకుంటూ  బైటికి వెళ్లి  కొంచెం దూరం లో  నిఠారుగా లేచి నించున్న ది. "తాతా!అక్కడ కొలను ఉండేదా? అటువైపు చెట్లు పొలాలు ఏమైనాయి?"అడిగాడు యువకుడు. "అవును బాబు! అక్కడ ఓపెద్ద కొలనుఉండేది.దాన్ని పూడ్చి ఇళ్ళు కట్టారు. పంటలు పండవు.గిల్లి కజ్జాలు కొట్లాటలు! ఆకింద ఉండేవారు వచ్చి  వారిని  దోచుకుని అగ్గి రగిల్చి బూడిద పాలు చేశారు.  అందుకే మేము  ఈగుట్టపై ఒంటిగా మిగిలాము.ఇద్దరం కలిసి ఒకేసారి చావాలని మాకోరిక"  యువకుడు అన్నాడు"అవ్వా!నాకు  ఒకముంతలోపాలు రెండో ముంతలో కాసిని మజ్జిగ ఇవ్వు " అని అడిగాడు. వాటినిరెండు కంచాలలో పోశాడు. మధ్య వయస్కుడు ఏవేవో మంత్రాలు చదివి  తిరిగి వాటిని ముంతల్లో నింపాడు. "అవ్వా! ఈపాలు నాలుగు గ్లాసుల్లో నింపు." "నాయనా!ముంత అడుగుకు ఉన్న పాలు నాల్గు గ్లాసులలో పోస్తేచిన్న చెంచా కూడా నిండదు " "లేదు  నీవు గ్లాస్ లో నింపు "ఆశ్చర్యం! ముంతలోని పాలను ఆమె నాలుగు గ్లాసుల్లో సర్దగానే అవి నిండాయి. తాత చేత మజ్జిగ ను రెండో ముంతలోంచి తీసి పోయమన్నాడు.అంతే!మజ్జిగ గ్లాసుల్లో నిండిపోయింది. "ఈరెండు ఇప్పుడు మంత్రాల ముంతలుగా మారాయి.మీరు వీటిని జాగ్రత్తగా కాపాడుకోండి.మీదగ్గరకు వచ్చేవారికి ఇవ్వండి పాలు మజ్జిగ.  ఆ గుట్టకిందివారు  సర్వనాశనమైపోతారు తమచెడ్డ చేతలతో."అని సెలవు తీసుకుని వెళ్లి పోయారు ఆఇద్దరూ!కొంత కాలానికి  కింద నించి అగ్ని జ్వాలలు ఎగిసిపడటం చూశారు ఆవృద్ధదంపతులు.కింద నుంచి  బలం శక్తి ఉన్న పిల్లలు గుట్టపైకి పరుగెత్తి వచ్చారు.అవ్వ తాత వారిని ఆదరించారు. ఆముంతలో ఏది పెట్టినా అక్షయపాత్రలా మారి అందరి కడుపు నింపింది. ఆపిల్లలు వారి దగ్గరే ఉండి  భూమి చదునుచేసి మొక్కలు నాటారు.ఉన్న ఆపదిమంది పిల్లలు ఐకమత్యం తో మెలిగిపెద్దవారు అవుతున్నా రు.ఆముంతల రహస్యం కేవలం ఆముసలి దంపతులకు మాత్రమే తెలుసు. అది తెలిస్తే పిల్లలు సోంబేరులుగామారుతారు.వారిని ఇరుగుపొరుగు ప్రాంతాల లో పాలు మజ్జిగ కూరలు అమ్మటానికి పంపేవారు.ఇప్పుడు అవ్వా తాత కదలలేని స్థితిలో ఉన్నారు. పిల్లలు స్వయంగా సంపాదించడం నేర్చుకున్నారు కాబట్టి  వారు ఆరెండు ముంతలను పగలగొట్టి భూమి లో పాతేశారు.ముంతలకోసం తగువు లాడుకుని కష్టపడటం మానేస్తారు అని వారి ఉద్దేశం. కొన్నాళ్ళకి అవ్వ తాత కన్నుమూశారు. ముంతలు పగలకొట్టి పాతిన చోట రెండు మొలకలు వచ్చాయి. ఏడాది కల్లా ఏపుగాపెరిగి బాటసారులకు నీడని ఇస్తున్నాయి.అవ్వా తాత చెట్లుగా మారారని జనం నమ్మకం. ఏడాది కోసారి వాటిని పూజించి వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటారు.
కామెంట్‌లు