ఫోటో - జయా
చూస్తున్నది నిజమే
ఆకాశాన్ని కమ్మేసిన చీకట్లు
రాదారిని మాత్రం 
వెలుగుమయం చేయడం 
విచిత్ర వినోదమే....

నీడ వర్ణం ఒక్క నలుపే 
కానీ
వెలుగు వర్ణాలనేకం

అంతమాత్రాన
నిజమైపోదు 
నీడ బింబం 
కానీ  
అబద్ధం కాబోదు

చీకటి సాక్షిగా 
తివాచీ పరచిన వెలుగు
ఆశ్చర్యంలో ముంచెత్తింది
కంటిచూపుని....

రూపం 
పరిమాణం వేరు
కానీ
ఉన్నది చూపించే నీడ
మన కళ్ళు కప్పి
వెలుగునివ్వడానికి
మాటలందక
మనసు 
చీకటి వెలుగులతో
మమేకమైంది

నీడా
నిజమూ ఒక్కటే
కానీ
నీడ నిజమైపోదు
నిజం నీడవుతుంది


కామెంట్‌లు